తెలంగాణలో టీటీడీ ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా రవిప్రసాద్‌

ABN , First Publish Date - 2023-09-08T00:51:31+05:30 IST

తెలంగాణలోని తిరు మల తిరుపతి దేవస్థానానికి చెందిన దేవాలయాలు, ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యలిశాల రవిప్రసాద్‌ నియమితులయ్యారు.

తెలంగాణలో టీటీడీ ఆస్తుల అభివృద్ధి  కమిటీ చైర్మనగా రవిప్రసాద్‌
యలిశాల రవిప్రసాద్‌కు ఉత్తర్వుల కాపీ అందజేస్తున్న టీటీడీ చైర్మన కరుణాకర్‌రెడ్డి

నల్లగొండ, సెప్టెంబరు 7 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): తెలంగాణలోని తిరు మల తిరుపతి దేవస్థానానికి చెందిన దేవాలయాలు, ఆస్తుల అభివృద్ధి కమిటీ చైర్మనగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన యలిశాల రవిప్రసాద్‌ నియమితులయ్యారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా, చైర్మన భూమన కరుణాకర్‌రెడ్డి ఉత్తర్వుల కాపీని అందజేశారు. ఈ సందర్భంగా రవిప్రసాద్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు టీటీడీ చైర్మన పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధితో పాటు ఆస్తులు రక్షించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Updated Date - 2023-09-08T00:51:31+05:30 IST