వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా రంగభట్టాచార్యులు

ABN , First Publish Date - 2023-08-02T00:21:56+05:30 IST

వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా హుజూ ర్‌నగర్‌కు చెందిన నరగిరినాథుని రంగభట్టాచార్యులు ఎన్నికయ్యారు.

వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా రంగభట్టాచార్యులు
రంగభట్టాచార్యులు

హుజూర్‌నగర్‌, ఆగస్టు 1: వైఖానస ఆగమ పరిషత జిల్లా అధ్యక్షుడిగా హుజూ ర్‌నగర్‌కు చెందిన నరగిరినాథుని రంగభట్టాచార్యులు ఎన్నికయ్యారు. పట్టణంలోని రామాలయంలో రాష్ట్ర అధ్య క్షుడు మోహన్‌కృష్ణ, గౌరవ అధ్యక్షుడు రాఘవాచార్యుల ఆధ్వర్యంలో వైఖానస ఆగమ పరిషత జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా తూమాటి శ్రీనివాసచార్యులు, కోశాధికారిగా నరగిరినాఽథుని మురళీకృష్ణమాచార్యులు, ఉపాధ్యక్షులుగా అద్దెపల్లి ఫణికుమారచార్యులు, పరశురం హరి, సిరికొండ అనంతకృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా అర్వపల్లి రాంబాబు, గౌరవ సలహాదారులుగా తుళ్లూరి పద్మనాభాచార్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తిరునగరం శ్రీనివాసచార్యులు, గాయత్రి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:21:56+05:30 IST