రైతుల పాలిట రాబంధు కాంగ్రెస్‌ పార్టీ

ABN , First Publish Date - 2023-07-22T00:53:06+05:30 IST

రైతుల పాలిట రాబంధు కాంగ్రెస్‌ పార్టీ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఆరోపించారు.

రైతుల పాలిట రాబంధు కాంగ్రెస్‌  పార్టీ
నడిగూడెం రైతు వేదికలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

నడిగూడెం, చిలుకూరు, జూలై 21: రైతుల పాలిట రాబంధు కాంగ్రెస్‌ పార్టీ అని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ఆరోపించారు. శుక్రవారం నడిగూడెం రైతు వేదికలో, చిలుకూరు మండలం బీతవోలు రైతు వేదికలో రైతులతో నిర్వహించిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులు నాసిరకం ఎరువులు, కల్తీ విత్త నాలు, కరువు కాటకాలతో రైతులు నరకం చూశా రన్నారు. ‘మూడు గంటల విద్యత విధానం నాశించాలి.. మూడు పంటలు వర్ధిల్లాలి’ అనే నినాదంతో రైతులను చైతన్యం చేయలన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత కష్టాలు తొలగాయని రైతులు సంతోషపడు తుంటే, కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమాతో పాటు వ్యవసాయానికి ఉచితంగా 24గంటలు విద్యుత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుం దని ఆ అన్నారు. రైతు సమన్వయ సమితి నడిగూడెం మండల అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి మధు బాబు, పీఏసీఎస్‌ చైర్మన రాజేష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, నాయకులు పాలడుగు ప్రసాద్‌, గార్ల పాటి శ్రీనివాస్‌రెడ్డి, మార్తి ఉపేందర్‌, గడ్డం నాగలక్ష్మీమల్లేష్‌యాదవ్‌, బడేటి చంద్రయ్య, కొటిరెడ్డి, దున్నా వెంకటేశ్వర్లు, ఎస్‌కే ఖలీల్‌అహ్మద్‌, బోనగిరి ఉపేందర్‌, కాసాని పుల్లయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు నడిగూడెం, రామా పురం, ఈకేపేట రైతులు, చిలుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కొండా సైదయ్య, నలబోలు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ వట్టికూటి చంద్రకళ, జడ్పీ కోఆప్షన సభ్యుడు జానీ మియా, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల నాయకులు బజ్జూరి వెంక ట్‌రెడ్డి, దొడ్డా సురేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు అల్సకాని జనార్దన, బాశం సైదులు, తాళ్లూరి శ్రీనివాస్‌, జానకిరామాచారి, రాంరెడ్డి, కొవ్వూరి వెంకటేశ్వర్లు, అశోక్‌, సర్పంచలు, రైతులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో బీతవోలు గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

జీపీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి

తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని జీపీ కార్మికులు కోరారు. ఈ మేరకు నడిగూడెం రైతువేదిక వద్దకు వచ్చిన ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ను జీపీ కార్మికులు కలిసి వినతిప్రతం అందజేశారు. 16 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, కార్మికులు నాగరాజు, సుభాని, మధుసూధన, వెంకన్న, రాములు, శ్రీకాంత తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2023-07-22T00:53:06+05:30 IST