ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2023-05-26T00:41:41+05:30 IST
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు.

మోతె, మే 25: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండలంలోని సిరికొండలో పలువురికి కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సిరికొండ నుంచి బుర్కచర్ల మార్గంలో రూ.30లక్షలతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.67 లక్షలతో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శీలం సైదులు, సర్పంచ నూకల సావిత్రమ్మ, వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, నూకల శ్రీనివా్‌సరెడ్డి, సతీష్, ఎంపీటీసీ కాంపాటి వెంకన్న, గుండాల గంగులు, మద్ది మధుసూదనరెడ్డి, కారింగుల శ్రీనివాస్, దేవులానాయక్, మధు పాల్గొన్నారు.