వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-06-26T00:35:59+05:30 IST

వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకో వాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు.

వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి : ఎమ్మెల్యే
భువనగిరిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, జూన్‌ 25: వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకో వాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సూచించారు. భువనగిరిలో ఆదివారం జరిగిన వెల్డింగ్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన డిజైన్లతో వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. వెల్డింగ్‌ అసోసియేషన్‌ కమిటీ హాల్‌కు ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.10 లక్షలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు పాముల పర్తి నరేంద్రాచారి, గౌరవ అధ్యక్షుడు నీల సత్యం, మునిసిపల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఎనబోయిన అంజనేయులు, జడల అమరేందర్‌గౌడ్‌, వైస్‌చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఏవీ కిరణ్‌కుమార్‌, అసోసియేషన్‌ సభ్యులు రాజు, శంకర్‌రావు, ఎండీ. ఖదీర్‌, వెంకన్న పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి: సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పర్యటనలు చేస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం 1,2, 3వ వార్డుల్లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకతీతంగా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వూస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కందాడి భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి యాదవ్‌, కౌన్సిలర్లు దారెడ్డి మంజుల వేణుగో పాల్‌రెడ్డి, కొంగరి కృష్ణ, సుర్కంటి జ్యోతి రంగారెడ్డి, నాయకులు సీత వెంకటేష్‌, గునిగంటి మల్లేష్‌గౌడ్‌, దారెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.

భువనగిరి రూరల్‌: ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసు కోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ముస్త్యా లపల్లిలో ఆర్‌కే ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అదే విధంగా గ్రామంలో రక్షణ కోసం ఏర్పా టు చేసిన 16సీసీ కెమెరాలను ప్రారంభించారు. మండలంలోని మన్నెవారిపంపు గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళ నంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ డాక్టర్‌ అమరేందర్‌, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, ఎంపీటీసీ కంచి లలిత, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, సర్పంచ్‌ గంటెపాక జంగయ్య, నాయకులు జనగా పాండు, రమేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-26T00:35:59+05:30 IST