Share News

అద్దె బస్సు యజమానుల సమస్యలు పరిష్కారించాలి

ABN , Publish Date - Dec 28 , 2023 | 12:31 AM

ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమస్యలు వెంటనే పరిష్కారించాలని ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అ బ్బ మదుకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం చౌటుప్పల్‌ మండల పరిధిలోని కొయ్యలగూడెం లో ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది.

అద్దె బస్సు యజమానుల సమస్యలు పరిష్కారించాలి

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్‌రెడ్డి

చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 27: ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమస్యలు వెంటనే పరిష్కారించాలని ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అ బ్బ మదుకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం చౌటుప్పల్‌ మండల పరిధిలోని కొయ్యలగూడెం లో ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ మహలక్ష్మీ పథకం అద్దె బస్సు యజమానులకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో మెయింటనెన్స్‌ పెరిగి యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. అద్దెను రూ.3 అదనంగా పెంచాలని డిమాండ్‌చేశారు. ఓవర్‌లోడుతో టైర్లు పగిలిపోతున్నాయని, ఆర్టీసీకి ఇచ్చే రేట్లకే తమకు టైర్లు ఇవ్వాలన్నారు. టైర్ల కిలోమీటర్‌ కాస్ట్‌ పెంచాలని కోరారు. కేఎంపీఎల్‌ను 4.5కి తగ్గించాలని, ప్ర యాణికులందరికీ ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. అద్దె బస్సు యజమానులకు అనేక సమస్యలు ఉండగా, మళ్లీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లు పిలవడం శోచనియమన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 5 నుంచి అద్దె బస్సులు బంద్‌ చేస్తున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వరకాంతం మహిపాల్‌రెడ్డి, కోశాధికారి సత్యంబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:31 AM