విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : ఎస్‌ఎ్‌ఫఐ

ABN , First Publish Date - 2023-08-22T01:25:31+05:30 IST

విద్యారంగ సమస్య లు పరిష్కరించాల ని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి డిమాం డ్‌ చేశారు. సోమవా రం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో నిర్వహించి న కలెక్టరేట్‌ ముట్టడిలో ఆయన మాట్లాడారు.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : ఎస్‌ఎ్‌ఫఐ

కలెక్టరేట్‌ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత

నల్లగొండ టౌ న్‌, ఆగస్టు 21: విద్యారంగ సమస్య లు పరిష్కరించాల ని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి డిమాం డ్‌ చేశారు. సోమవా రం ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో నిర్వహించి న కలెక్టరేట్‌ ముట్టడిలో ఆయన మాట్లాడారు. కేజీ టు పీజీ వరకు ఉచి త విద్య అని సీఎం కేసీఆర్‌ ప్రకటించి తొమ్మిదేళ్లవుతున్నా, నేటికీ అమలు కాలేదన్నారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోజురోజుకూ నిత్యావసర ధరలు పెరుగుతున్నా కాస్మోటి క్‌ చార్జీలను పెంచడంలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. జిల్లాలో కొత్తగా ప్రారంభించిన గురుకులాలకు సొంతభవనాలు లేక అద్దెభవనాల్లో అరకొర వసతులతో కొనసాగుతున్నాయన్నారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్కా లర్‌షి్‌పలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయలేదన్నారు. ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకుంటే చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వానికి నినాదాలు చేశారు. అనంతరం సమస్యలను అధికారులకు విన్నవించేందుకు కలెక్టరేట్‌లోనికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త నెలకొంది. అనంత రం ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యరక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆకారపు నరేష్‌, ఖమ్మంపాటి శంక ర్‌, రేణుక, కొర్ర సైదానాయక్‌, రమావత్‌ లక్ష్మణ్‌, కోరే రమేష్‌, రవీందర్‌, ముడావత్‌ జగన్‌, జగదీశ్‌, వీరన్న, వదూద్‌, సమ్మద్‌, సంపత్‌, రవి, యశ్వంత్‌, ప్రశాంత్‌, లోకేష్‌, శ్రీకాంత్‌, శ్రవణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:25:31+05:30 IST