ప్రధాని మోదీ నియతృత్వానికి పరాకాష్ట

ABN , First Publish Date - 2023-03-26T00:02:43+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ దురంకాహారం, నియతృత్వానికి పరాకాష్ట అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

ప్రధాని మోదీ నియతృత్వానికి పరాకాష్ట
బొమ్మలరామారంలో మోదీ దిష్టి బొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

బొమ్మలరామారం, మార్చి 25: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం ప్రధాని మోదీ దురంకాహారం, నియతృత్వానికి పరాకాష్ట అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మండలం కేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి బీర్ల ఐలయ్య, మండల అధ్యక్షుడు సింగిర్తి మల్లేశం, సర్పంచ్‌ రాంపల్లి మహేశ్‌గౌడ్‌, ఎంపీటీసీలు మైలారం ఈదమ్మ, శ్రీహరి నాయక్‌, నాయకు లు నందరాజ్‌గౌడ్‌, రాజే్‌షఫైలెట్‌, ప్రేంకుమార్‌రెడ్డి, బేతాల శ్రీనివాసులు, రాజునాయక్‌, మైలారం ఈశ్వర్‌, జూపల్లి శ్రీకాంత్‌, బేతాల రామాంజనేయులు పాల్గొన్నారు.

యూత్‌ కాంగ్రెస్‌ ధర్నాలో ఉద్రిక్తత

భువనగిరి టౌన్‌: ఎంపీగా రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ యూత్‌ కాంగ్రెస్‌ ఆఽధ్వర్యం లో శనివారం భువనగిరిలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జగ్జీవన్‌రామ్‌ చౌరస్తా వద్ద యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. యూత్‌ కాం గ్రెస్‌ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పోలీసులు స్వాఽ దీనం చేసుకున్న ప్రధాని దిష్టిబొమ్మను లాక్కొని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్‌, రాష్ట్ర కార్యదర్శులు పుట్ట గిరీష్‌, ఎనగండ్ల సుధాకర్‌, ముత్యాల మనోజ్‌, వంగాల వెంకన్న, మహేందర్‌, జవగాని శ్రీధ ర్‌, వాసుదేవరెడ్డి, చందు, దేవేందర్‌, ఉపేందర్‌, అశోక్‌, రవితేజ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:02:43+05:30 IST