అర్చకులకు కేసీఆర్‌ పాలనలో ఆదరణ

ABN , First Publish Date - 2023-08-02T00:29:37+05:30 IST

అర్చకులకు సీఎం కేసీఆర్‌ పాలనలో ఆదర ణ లభిస్తోందని, పాలనలో మేటిగా నిలిచిన ఆయనకు బ్రాహ్మణుల ఆశీర్వదాలు ఉండాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మంత్రికి బ్రాహ్మణులు వేద మంత్రాలతో పూర్ణకుంభం స్వాగతం పలకగా, జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చి మాట్లాడారు.

అర్చకులకు కేసీఆర్‌ పాలనలో ఆదరణ

మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటరూరల్‌, సూర్యాపేటటౌన్‌, ఆగ స్టు 1: అర్చకులకు సీఎం కేసీఆర్‌ పాలనలో ఆదర ణ లభిస్తోందని, పాలనలో మేటిగా నిలిచిన ఆయనకు బ్రాహ్మణుల ఆశీర్వదాలు ఉండాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సమాఖ్య ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మంత్రికి బ్రాహ్మణులు వేద మంత్రాలతో పూర్ణకుంభం స్వాగతం పలకగా, జ్యో తి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక అన్నం పెట్టే రైతులకు, ఆశీర్వదించే అర్చకులకు ఆదరణ పెరిగిందన్నారు. అటు రైతాంగం, ఇటు అర్చకులు ఈ మార్పును గమనించాలని కోరారు. రైతు అని చెప్పుకునేందుకు, అర్చకత్వం చేస్తున్నానని చెప్పుకునేందుకు బిడియపడిన రోజుల నుంచి తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి తెలంగాణ సమాజం చేరిందన్నారు. అందుకు కేసీఆర్‌ రూపొందించిన ప్రణాళికలే కారణమన్నారు. దీన్ని అర్చకు లు జనబాహుళ్యంలోనికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ధూపదీప నైవేద్యం పేరుతో గౌర వ వేతనాన్ని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవాశర్మ, రామలింగేశ్వరశ ర్మ,గోపికృష్ణమార్యులు,హరికిషన్‌శర్మ,లక్ష్మీనర్సయ్య, మంత్రమూర్తి శంకరమూర్తి,ప్రసాద్‌శర్మ, పాల్గొన్నారు.

బౌద్ధ శిల్ప సంపదను భద్రపరిచేందుకు మ్యూజియం

నాగారం: ఫణిగిరిలో ఉన్న బౌద్ధ శిల్పాలను భద్రపరిచేందుకు మ్యూజియాన్ని పూర్తి వసతులతో ఏర్పాటుచేస్తామని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. మంగళవారం నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో శిల్ప సంపదను భద్రపరిచి న మ్యూజియాన్ని రాష్ట్ర ఆర్కియాలజీ, టూరిజం ప్రిన్సిపాల్‌ సెక్రటరీ శైలజ రామయ్యార్‌, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఇక్కడి శిల్పాల విశిష్టతను శైలజ రామయ్యార్‌ మంత్రి, ఎమ్మెల్యేకు వివరించారు. ప్రస్తుతం మ్యూజియం శిఽథిలావస్థకు చేరడంతోపాటు వర్షాలకు కురుస్తుండడంతో బౌద్ధ శిల్పాలు దెబ్బతినే ప్రమాదం ఉం దని ఆమె వివరించారు. మ్యూజియంను వేరేచోటికి తరలించేందుకు గ్రామంలో ఉన్న ప్రభుత్వ గోదాం, ఫణిగిరి గుట్ట కింద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్‌రావుతో కలిసి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపాదికన నెలరోజుల్లో తాత్కాలికంగా మ్యూ జియం ఏర్పాటు చేయాలని కల్టెకర్‌ను మంత్రి ఆదేశించారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో అత్యాధునిక హం గులతో భవనాలు, మ్యూజియం, బౌద్ధ భిక్షువులు, టూరిస్టులకు వసతి, గార్డెన్‌ గుట్టపై ఎక్కేందుకు మెట్ల ఏర్పాటుకు నిధుల మంజూరుకు ప్రతిపాదన లు సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ, పీఆర్‌శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ బి.నారాయణ, మ్యూజి యం డిప్యూటీ డైరెక్టర్‌ పి.నాగారాజు, ఆర్కియాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బుజ్డి, ఆర్డివో వీరబ్రహ్మచారి, తహసీల్దార్‌ హరిచంద్రప్రసాద్‌, సర్పంచ్‌ గట్టు నర్సింహారావు, కె.ఉప్పలయ్య, గుండగాని అంబయ్య గౌడ్‌, యారాల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:29:37+05:30 IST