డంపింగ్‌ యార్డుకు నిప్పుతో ప్రజల ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2023-06-03T01:29:33+05:30 IST

గడ్డివాము దగ్ధం మద్దిరాల, జూన్‌ 2: మండల కేంద్రంలో గడ్డివాము దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల శివారులో వ్యవసాయ బావులు వద్ద కొంతమంది రైతులు శుక్రవారంవరి కొయ్యలను నిప్పు పెట్టారు. ఈ మంటలు ఉన్న వల్లపు రమేష్‌ గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమైంది. ఈ మంటలు చుట్టుపక్కల 10ఎకరాలకు విస్తరించగా, రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రమే్‌షకు చెందిన రూ.10వేల విలువైన 100 మోపుల గడ్డి దగ్ధమైంది.

డంపింగ్‌ యార్డుకు నిప్పుతో ప్రజల ఉక్కిరిబిక్కిరి

నేరేడుచర్ల, జూన్‌ 2: మునిసిపాలిటీ పరిధిలోని బట్టువానికుంట గ్రామంలో డంపింగ్‌ యార్డుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామానికి 50మీటర్ల దూరంలో బండమీద డంపింగ్‌ యార్డును ఏర్పాటుచేయడాన్ని ఆ సమయంలో స్థానికులు వ్యతిరేకించారు. వేసవికాలం అయినందున ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో ఈ ప్రాంతం మొత్తం పొగమయంగా మారింది. ఇళ్లలో ఉండే పరిస్థితి లేనందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా పొగ కమ్ముకోవడంతో ప్రజలు వ్యవసాయ భూముల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగ తగ్గిన తర్వాతే ఇళ్లకు వచ్చే పరిస్థితి ఉంది. నిబంధనలను విరుద్ధంగా గ్రామానికి ఆనుకుని డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేయడంపై ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ సరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.డంపింగ్‌ యార్డును వెంటనే తరలించాలని కోరారు.

Updated Date - 2023-06-03T01:30:09+05:30 IST