పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2023-09-20T00:08:58+05:30 IST
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని డీజీ పీ అంజనీకుమార్ అన్నారు. నెలవారీ సమీక్షలో భాగంగా మంగళవారం హైదరాబాద్ నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.

సూర్యాపేటక్రైం, సెప్టెంబరు 19 : పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని డీజీ పీ అంజనీకుమార్ అన్నారు. నెలవారీ సమీక్షలో భాగంగా మంగళవారం హైదరాబాద్ నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కేసుల వివరాలు, సైబర్ నేరాలు, ఎన్నికల సన్నాహకాలు, లోక్‌అదాలతల నిర్వహణ, కమ్యూనిటీ కార్యక్రమాలు, పోలీస్ పనివిభాగల పనితీరు అంశాలపై ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో సమీక్షించారు. వచ్చే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ ఫంక్షనల్ వర్టికల్స్(పోలీస్ పని విభాగాలు)లో ప్రతినెలా ప్రతిభ కనబర్చుతూ జిల్లా గ్రీనజోనలో కొనసాగుతుండడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామన్నారు. పోలీ్‌సస్టేషన్లలో పెండింగ్ కేసులు లేకుం డా చూస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, కోదాడ డీఎస్పీ ప్రకాష్, సైబర్ క్రైం డీఎస్పీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ ఇనస్పెక్టర్ రాజేష్, ఎన్నికల సెల్ ఇనస్పెక్టర్ మహేష్, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.