పెద్దగట్టు జాతరకు సర్వంసిద్ధం

ABN , First Publish Date - 2023-02-02T00:23:10+05:30 IST

పెద్దగట్టు లింగమంతుల జాతరకు సర్వంసిద్ధం చేసినట్లు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి తెలిపారు.

పెద్దగట్టు జాతరకు సర్వంసిద్ధం
పెద్దగట్టు జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

జాతర ఏర్పాట్ల పరిశీలన

చివ్వెంల, ఫిబ్రవరి 1: పెద్దగట్టు లింగమంతుల జాతరకు సర్వంసిద్ధం చేసినట్లు విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని దురాజ్‌పల్లి లింగమంతులస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు, పాలకవర్గంతో కలిసి బుధవారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 9 వరకు జరిగే దేశంలోనే రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి ఉత్సవాలకు రూ.6.50 కోట్లు కేటాయించామన్నారు. జాతరకు 10 లక్షల నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉండడంతో దానికి అనుగుణంగా బందోబస్తుతోపాటు అన్ని శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించామన్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగు, కనీస అవసరాలకు నీరు, మరుగుదొడ్ల సౌకర్యంపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో పెద్దగట్టు ట్రస్టు బోర్డు చైర్మన్‌ కోడి సైదులుయాదవ్‌, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, వైస్‌ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిషోర్‌, నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, ఈవో కుశలయ్య, కౌన్సిలర్లు, పాలకవర్గ ధర్మకర్తలు జటంగి వెంకటేశ్వర్లు, మట్టపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగంపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ : మంత్రి

విద్యారంగంపై సీఎం కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని, విద్యార్థుల భవిష్యత్‌ కోసం అధికంగా నిధులు కేటాయిస్తున్నారని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.18లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ బడి వద్దు అన్న రోజులు పోయి ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే స్థాయికి వచ్చామన్నారు. అనంతరం పశువుల దవాఖాన, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కుమారిబాబునాయక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మారినేని సుధీర్‌రావు, సర్పంచ్‌ జూలకంటి సుధాకర్‌రెడ్డి, గుర్రం సత్యనారాయణరెడ్డి, పుట్ట గురువేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:23:11+05:30 IST