కొనసాగిన పంచాయతీ కార్మికుల నిరసన
ABN , First Publish Date - 2023-07-21T00:41:36+05:30 IST
పంచాయతీ బీబీనగర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం దీక్షా శిబిరం వద్ద వర్షంతో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు.
బీబీనగర్, జూలై 20: పంచాయతీ బీబీనగర్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోసం సమ్మె కొనసాగిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం దీక్షా శిబిరం వద్ద వర్షంతో తడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ గాడి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 21వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాయం ఎదుట నిర్వహించ తలపెట్టిన ధర్నాను వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పొట్ట యాదమ్మ, పాశం బాలయ్య, యాదగిరి, రమేష్, గోవింద్ పోచయ్య, నర్సమ్మ, రవి, అండాలు, చంద్రభాను పాల్గొన్నారు.