పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2023-05-02T00:33:36+05:30 IST

పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతితో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశా రు.

పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
మునుగోడులో పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు మద్దతు తెలుపుతున్న ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌

మునుగోడు, మే 1: పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతితో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశా రు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మునుగోడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట జే పీఎస్‌, వోపీఎ్‌సలు చేపట్టిన దీక్షకు సోమవారం ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. ఇటీవల ఐదు వేల ఉద్యోగాల ను క్రమబద్ధీకరించిన ప్రభుత్వానికి కార్యదర్శులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవానికి కార్యదర్శుల ప్రొహిబిషన్‌ కాలపరిమితి రెండేళ్లకు అదనంగా పెంచిన సమయం సైతం పూర్తి అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చర్యలు పదివేల మంది కుటుంబాల జీవితాలతో ఆటాడుకుంటుండటం తో వారు బజారున పడే పరిస్థితి నెలకొందన్నా రు. పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి మహిళా ఉద్యోగుల పట్ల అవహేళనగా వ్యవహిరిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం కాదని, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇచ్చిన ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజల ను మోసం చేయటమేనన్నారు. మునుగోడును దత్తత తీసుకుంటానని ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటానని అట్టహాసంగా ప్రకటించిన మంత్రి కేటీఆర్‌ ఆచరణలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రాజెక్టుల పూర్తి కోసం, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో మోసమే జరిగిందన్నారు. మరో పక్క గొర్రెల పథకం పేరుతో గొల్ల, కురుమలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. విద్య, వైద్యం లో మార్పు లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల సాధన కోసం తమ పార్టీ నిరంతరం పోరు సాగిస్తోందన్నారు. ఈ సమ్మెలో ఓ కార్యదర్శి కుమార్తె చిన్నారి తన తల్లితో కలిసి ప్లకా ర్డు పట్టుకొని నిరసన చేశారు. ‘మా అమ్మకు ఉద్యోగ భద్రత కల్పించాలి’ అనే ప్లకార్డు ఉండడంతో అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, గోవర్ధన్‌, నిర్మల, కవిత, అందోజు శంకరాచారి, నాగేంద్ర, అర్జున్‌, పరుశురాం పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T00:33:36+05:30 IST