అభివృద్ధిలో అధికారులదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2023-08-22T23:58:29+05:30 IST

జిల్లా అభివృద్ధిలో అధికారులదే కీలకపాత్ర అని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌లో సూర్యాపేట, నల్లగొండ జిల్లా కలెక్టర్లు ఎస్‌.వెంకట్రావ్‌, ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

అభివృద్ధిలో అధికారులదే కీలకపాత్ర

మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఆగస్టు 22 : జిల్లా అభివృద్ధిలో అధికారులదే కీలకపాత్ర అని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌లో సూర్యాపేట, నల్లగొండ జిల్లా కలెక్టర్లు ఎస్‌.వెంకట్రావ్‌, ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అధికారుల ద్వారానే ప్రజల్లోకి వెళ్తాయన్నారు. ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు. ఏపనినైనా ద్వేషంతో కాకుండా ప్రేమతో సాధించాలన్నారు. ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తే వారి విభాగాల పనితీరులో మార్పు వస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లకు, ప్రస్తుత పరిస్థితులకు స్పష్టమైన తేడాను గమనించాలన్నారు. అధికారులు ఇష్టంతో పనిచేయడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రి జగదీ్‌షరెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీహెచ్‌ ప్రియాంక, వెంకటరెడ్డి, అధికారులు సుందరి కిరణ్‌కుమార్‌, సురేష్‌, వెంకటేశ్వర్లు, రామారావునాయక్‌, శ్రీధర్‌, రాంపతి, శర్మ, ఆర్డీవో వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T23:58:29+05:30 IST