రహీంఖాన్‌గూడ, బ్రాహ్మణపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు

ABN , First Publish Date - 2023-03-31T00:16:43+05:30 IST

మండలంలోని రహీంఖాన్‌గూడ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎ్‌సఎ్‌స క్యాంపులు నిర్వహిస్తున్నారు.

 రహీంఖాన్‌గూడ, బ్రాహ్మణపల్లిలో ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపు
బ్రాహ్మణపల్లిలో వీధుల్లో పిచ్చి మొక్కలను తొలగిస్తున్న ఆర్మీ కళాశాల విద్యార్థులు

బీబీనగర్‌, మార్చి 30: మండలంలోని రహీంఖాన్‌గూడ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో సాంఘిక సంక్షేమ సైనిక శిక్షణ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎ్‌సఎ్‌స క్యాంపులు నిర్వహిస్తున్నారు. క్యాంప్‌లో భాగంగా ఆర్మీ కళాశాల విద్యార్థులు గురువారం ఇంటింటి సర్వే నిర్వహించి, కుటుంబ సభ్యుల వివరాలు, విద్యావంతులు కాని, నిరుద్యోగుల వివరాలను సేకరించారు. ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో ఉపాధి ప్రణాళికను ఆదాయ వనరులకు సంబంధించిన వివరాలు సేకరించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించి రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, కొలను సత్తిరెడ్డి, మంచాల రవికుమార్‌, ఉపసర్పంచ్‌ సదాలక్ష్మి, ఎంపీటీసీ కొలను సత్యమణి, ఆర్మీ కళాశాల ప్రిన్సిపల్‌ పాండురంగ శర్మ, ఫోగ్రాం ఆఫీసర్‌, విజయలక్ష్మీ, క్యాంప్‌ అనుసంధాన కర్త ఝాన్సీ సంతోష పాల్గొన్నారు.

వలిగొండ: మండల కేంద్రంలోని ప్రగతి డిగ్రీ కళాశాల ఎన్‌ఎ్‌సఎ్‌స వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువత యొక్క వివరాలను సేకరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసర్‌ ధనుంజయ, ఉపాధ్యాయులు వెంకటేశం, ప్రణయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:16:43+05:30 IST