రెండు దశాబ్దాలైనా సాగునీరేదీ?

ABN , First Publish Date - 2023-06-03T00:30:39+05:30 IST

శ్రీరాంసాగర్‌ రెండో దశ(ఎస్సారె స్పీ)కాల్వ తవ్వకాలు జరిగి రెండు దశాబ్దాలైనా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు.

రెండు దశాబ్దాలైనా సాగునీరేదీ?
సీతారాంపురం వద్ద లైనింగ్‌ లేని 71డీబీఎం మెయినకాల్వ

అర్వపల్లి, జూన 2 : శ్రీరాంసాగర్‌ రెండో దశ(ఎస్సారె స్పీ)కాల్వ తవ్వకాలు జరిగి రెండు దశాబ్దాలైనా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు. ప్రతీ ఏడాది రైతులకు నిరాశే ఎదురవుతోంది.కాల్వల్లోకి నీటిని విడుదల చేయడం ప్రా రంభించి రెండు దశాబ్దాలైనా నేటికీ నీటి రాక ప్రశ్నార్ధకంగానే మిగిలింది.ఉపకాల్వ ల్లో పిచ్చిమొక్కలు,పూడిక పేరుకుపోయి1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తు న్నా చివరి భూములకు నీరందడం లేదు. నిర్వహణ లేక శ్రీరాంసాగర్‌ కాల్వలు అస్తవ్యస్తంగా మారటంతో నీరు వృథా అవుతోంది. ఎస్సారెస్పీ 69, 70, 71 డీబీఎం మెయిన కాల్వలకు, ఉప కాల్వలకు దశాబ్దాలుగా కాంక్రీట్‌ లైనింగ్‌ లేక 30 శాతం నీరువృథా అవుతున్నా పట్టించుకునే నాథుడేలేడు. 20 ఏళ్ల కిందట రూ.1100 కోట్లతో కాల్వలుతవ్వారు. అయితే ఈ కా ల్వలద్వారా గోదావరి జలాలతో 2.44లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని 12 మండలాల్లో 192 గ్రామాల్లోని 300 చెరువులతో పాటు వానాకాలం, యాసంగి పంటలకు నీరందిస్తున్నారు.

కాల్వల్లో పిచ్చిమొక్కలు, పూడిక

అర్వపల్లి మండలం రామన్నగూడెం, అర్వపల్లి, కుంచమ ర్తి, తిమ్మాపురం గ్రామాల సమీపంలో ఉప కాల్వల్లో పిచ్చి మొక్కలు పెరిగి, మట్టి పూడుకుపోయి కాల్వలు అధ్వానంగా మారాయి. అదేవిధంగా నడిగూడెం, మునగాల, చివ్వెంల, మద్దిరాల, నూతనకల్‌, మోతె, పెనపహాడ్‌, ఆత్మకూర్‌(ఎస్‌) మండలాల్లోని ఆయకట్టు చివరి భూములకు ఇప్పటి వరకు నీరందిన దాఖాలా లేదు. సాగునీటి కోసం రైతులు ఆందోళన చేసినా, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పరిస్థితిలో మార్పురాలేదు.

అస్తవ్యస్తంగా తూములు, లైనింగ్‌ మరమ్మతులు

ఎస్సారెస్పీ ప్రధానకాల్వలు జిల్లాలో 150 కిలోమీటర్ల మే ర ఉన్నాయి. ఏడేళ్ల క్రితం కాల్వల ఆధునికీకరణ కోసం రూ.12కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల దూరం (నాగారం మం డలం ఈటూరు నుంచి అర్వపల్లి మండలం గోపాల్‌రెడ్డినగ ర్‌ వరకు) కాల్వలకు మాత్రమే లైనింగ్‌ పనులు చేశారు. మిగిలిన 142 కిలోమీటర్ల దూరాన్ని వదిలేశారు. అదే ఏడాది రూ.2 కోట్లతో 45 తూములకు మరమ్మతు చేసినా, ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసినప్పుడు తూముల షట్టర్లు పనిచేయక రైతులు అవస్థలు పడుతున్నారు.

పునర్జీవ పథకం కింద రూ.300కోట్లతో ప్రతిపాదనలు

ఎస్సారెస్పీ 69, 70, 71 డీబీఎం మెయిన కాల్వలతో పాటు ఉపకాల్వల మరమ్మతుల కోసం పునర్జీవ పథకం కిం ద అధికారులు ఆరేళ్ల కిందట రూ.300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే నిధులు మంజూరు, పనుల ప్రారంభం అతీగతీ లేదు. దీంతో కాల్వల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. 70 కిలోమీటర్ల ప్రధాన కాల్వలతో పాటు అత్యధిక పొడవుతో ఉపకాల్వలు కూడా తవ్వారు. అర్వపల్లి మండలం లో 8ఎల్‌, 9ఎల్‌, 10ఎల్‌, 11ఆర్‌, 12ఎల్‌, 13ఆర్‌, 14ఎల్‌, 15ఎల్‌, 16 ఆర్‌, మైనర్‌ ఉపకాల్వలు ఉన్నాయి. కాసర్లపాడు గ్రామంలో 12 గొలుసు కట్టు చెరువులు ఉన్నా ఆ చెరువులకు నీరందడంలేదు. పునర్జీవ పథకం కింద రుద్రమచెరువు, వెంపటి చెరువు, గొట్టిపర్తి చెరువు, బండరామారం చెరువుల నీటి సామర్థ్యాన్ని పెంచి రిజర్వాయర్లు గా మార్చాలన్న ఉద్దేశ్యంతో ఎస్సారెస్పీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి.

కాల్వలకు లైనింగ్‌ పనులు చేపట్టాలి.

శ్రీరాంసాగర్‌ రెండోదశ మెయిన కాల్వలకు, ఉప కాల్వలకు కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చేపట్టి గోదావరి జలాలను నిరంతరం అందించాలి. కాల్వల్లో పిచ్చి మొక్కలను తొలగించి పూడిక తీయించాలి. వారబందీ కాకుండా నిరంతరం నీటిని విడుదల చేయాలి.

- బైరబోయిన భూమయ్య, రైతు, అర్వపల్లి

మా గ్రామానికి గోదావరి జలాలు రావడం లేదు

శ్రీరాంసాగర్‌ కాల్వలను 20ఏళ్ల క్రితం తవ్వినా, 12 గొలుసు కట్టు చెరువులు ఉన్నా మా గ్రామంలోకి గోదావరి జలా లు రావడంలేదు. మా గ్రామ చెరువులకు కాల్వలు తవ్వించి గోదావరి జలాలు అందించాలి.

- బందెల శంకర్‌, రైతు, కాసర్లపాడు

మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపాం

శ్రీరాంసాగర్‌ మెయిన కాల్వలు, ఉపకాల్వల్లో పూడికతీత కోసం నిధులకు ప్రతిపాదనలు పంపాం. జిల్లాలో 300 చెరువులకు కాళేశ్వరం జలాలు అందిస్తున్నాం. శ్రీరాంసాగర్‌ కాల్వల మరమ్మతు కోసం రూ.350 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. చివరి భూములకు నీరందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.

- పిచ్చయ్య, డీఈ

Updated Date - 2023-06-03T00:30:39+05:30 IST