మోటకొండూరు ఉపసర్పంచ్‌పై నెగ్గిన అవిశ్వాసం
ABN , First Publish Date - 2023-03-02T00:59:33+05:30 IST
మోటకొండూరు ఉప సర్పంచ్‌పై సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, వార్డు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
మోటకొండూరు, మార్చి 1: మోటకొండూరు ఉప సర్పంచ్‌పై సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, వార్డు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఆర్డీవో భూపాల్‌రెడ్డి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో వీరస్వామి సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత నెల 8న ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ సర్పంచ్‌లో పాటు వార్డు సభ్యులు ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఆర్డీవోతో పాటు తహసీల్దార్, ఎంపీడీవో సమక్షంలో ఉప సర్పంచ్ రేగు శ్రీనివా్‌సపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమాశానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మొత్తం 13 మంది హాజరయ్యారు. ఉప సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించాలని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత, వార్డు సభ్యులు వంగాల స్వరూప, బుగ్గ భాగ్యలక్ష్మి, బీరకాయల మల్లేష్, జంగవెళ్లి జహంగీర్, కాంబోజు నాగారాజు, మోకాళ్ల కవిత, జంపాల సత్తమ్మతో కలిపి 8 మంది తీర్మానిస్తూ చేతులు పైకి ఎత్తారు. మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు ఉప సర్పంచ్‌గా కొనసాగిన శ్రీనివా్‌సను పదవి నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ సభ తీర్మానం అంశాలను ఉన్నతధికారులకు పంపించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. నూతన ఉప సర్పంచ్ ఎన్నికకోసం మరో తేదీని ఉన్నతధికారులు వెల్లడిస్తారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎస్‌ఐ మాధుసూదన్, ఆలేరు ఎస్‌ఐ ఇజ్రీత్ అలీ అధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గత నాలుగు సంవత్సరాలుగా మోటకొండూరు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌గా పని చేసిన రేగు శ్రీనివాస్ పంచాయతీని అడ్డు పెట్టుకొని అనేక అవినీతి పనులకు పాల్పడ్డాడని వార్డు సభ్యురాలు బుగ్గ భాగ్యలక్ష్మిమ ఆరోపించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యలయం అవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో వార్డు సభ్యులు వంగాల స్వరూప, కాంబోజు నాగరాజు, బీరకాయల మల్లేష్, జంగవెళ్లి జహంగీర్, జంపాల సత్తమ్మ, మోకాళ్ల కవిత ఉన్నారు.