కొండమల్లేపల్లి పీహెచ్‌సీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు
ABN , First Publish Date - 2023-06-15T00:01:54+05:30 IST
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు వరించింది. 2022- 23 సంవత్సరానికి ఉత్తమ సేవలకు అవార్డును తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండలో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమా వత్ రవీంద్రకుమార్ సమక్షంలో ఎంపీపీ దూదిపాల రేఖ చేతుల మీదుగా పీహెచ్‌సి వైద్యాధికారి ఉషారాణి అందుకున్నారు.
కొండమల్లేపల్లి, జూన్ 14 : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు వరించింది. 2022- 23 సంవత్సరానికి ఉత్తమ సేవలకు అవార్డును తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండలో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవ వేడుకల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రమా వత్ రవీంద్రకుమార్ సమక్షంలో ఎంపీపీ దూదిపాల రేఖ చేతుల మీదుగా పీహెచ్‌సి వైద్యాధికారి ఉషారాణి అందుకున్నారు. ఐదు నెలల కిందట ఎన్.క్యూ.ఏ.ఎ్‌స(నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్) కేంద్ర బృందం పీహెచ్‌సీని సందర్శించి కేంద్రంలోని అధునాతన వైద్య పరికరాలను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చెందడంతో జాతీయ స్థాయి ఉత్తమ సేవ అవార్డుకు ఎంపికయ్యింది. ఇదిలా ఉంటే కొండమల్లేపల్లి పీహెచ్‌సీని ఎం పీపీ దూదిపాల రేఖశ్రీధర్‌రెడ్డి దంపతులు దత్తత తీసుకుని అభివృద్ధి పరు స్తున్నారు. సుమారు రూ.20లక్షలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధునాతన వైద్యపరికరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయించారు. అలాగే పీహెచ్ సీలో మౌలిక సదుపాయాలు కల్పించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. దీనికి తోడు ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఐదుగురు సిబ్బందిని నియమించి వారికి ప్రతి నెలా రూ.70 వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు.