యాదగిరిక్షేత్రంలో నాగవల్లీ దళార్చనలు

ABN , First Publish Date - 2023-08-02T00:25:27+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి చెంత ఆంజనేయస్వామిని అర్చకస్వాములు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం అనంతరం వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. ఆంజనేయుడికి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించారు.

యాదగిరిక్షేత్రంలో నాగవల్లీ దళార్చనలు
శివాలయంలో సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, ఆగస్టు 1: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో కొలువుదీరిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యపూజలు ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి చెంత ఆంజనేయస్వామిని అర్చకస్వాములు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం అనంతరం వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. ఆంజనేయుడికి సహస్రనామ పఠనాలతో నాగవల్లీ దళార్చనలు నిర్వహించారు. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపి నిజాభిషేకం, నిత్యార్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. కొండపైన అనుబంధ ఆలయమైన శివాలయంలో రామలింగేశ్వరస్వామికి, ముఖమండపంలోని స్పటిక మూర్తులకు నిత్యపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలో పుష్కరిణి, ప్రధానాలయంలోని, కొండపైన శివాలయంలోని ఆంజనేయస్వామిని ఆరాధిస్తూఅర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.

స్వామిసేవలో కలెక్టర్‌

యాదగిరీశుడిని యాదాద్రి భువనగిరి కలెక్టర్‌ టీ.వినయ్‌కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపారు. ఆయన ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణపుష్పార్చన, పూజల్లో పాల్గొన్నారు. ఆయనవెంట అధికారులు ఉన్నారు.

వైభవంగా సహస్రనామార్చనలు

యాదగిరికొండపైన అనుబంధ ఆలయమైన శివాలయంలోని ఉపాలయంలో సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అధిక శ్రావణ మాసం, పౌర్ణమి తిథిని పురస్కరించుకుని వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం జరిపిన పూజారులు సహస్రనామార్చనలు నిర్వహించారు. ఈ విశేష పూజా కైంకర్యాలను దేవస్థాన ప్రధాన పురోహితులు గౌరిభట్ల సత్యనారాయణశర్మ, ప్రధానార్చకులు గౌరిభట్ల నారసింహరామశర్మ, అర్చకబృందం, వేదపండితులు నిర్వహించగా డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గజవెల్లి రఘు, పర్యవేక్షకులు జాటోజ్‌ శంకర్‌నాయక్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:25:27+05:30 IST