మోదీ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయం
ABN , First Publish Date - 2023-05-28T00:36:19+05:30 IST
ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.
సూర్యాపేట సిటీ, మే 27: ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జిల్లా మోర్చా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. ఈ నెల 30 నుంచి జూన 31వరకు ‘మహాజన సంపర్క్ అభియాన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చిందన్నారు. ఆయుష్మాన భారత పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందజేస్తోందన్నారు. ఈ పథ కాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం నేరుగా నిధులను మంజూరు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సమావేశంలో బీజేపీ పార్లమెంట్ కోకన్వీనర్ తుక్కాని మన్మథరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమళ్ల నరసింహరావు, గజ్జల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్, దాసరి వెంకన్న, మీర్‌అక్బర్, అర్రూరి శివ, వల్థాస్ ఉపేందర్, కర్నాటి కిషన, భాను పాల్గొన్నారు.
బండి సంజయ్‌కు స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు
ఖమ్మంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుద్యోగ మార్చ్‌కు హైదరాబాద్ నుంచి వెళుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఆగారు. ఆయనకు సంకినేని వెంకటేశ్వర్‌రావు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సంజయ్‌తో కలిసి నిరుద్యోగ మార్చ్‌కు తరలివెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకువెళ్లాలి
నాగారం: కేంద్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తీసుకువెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కడియం రామచంద్రయ్య అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించి బీజేపీ మండల స్థాయి కార్యకర్తలు సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పేరాల పూలమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగు వెంకన్న, పార్టీ మండలం అధ్యక్షుడు చిరంజివి, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, గిరిప్రసాద్. రమేష్, వెంకన్న పాల్గొన్నారు.