యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్‌

ABN , First Publish Date - 2023-07-21T01:14:21+05:30 IST

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్‌ రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. గురువారం భువనగిరి శివారులోని రాయిగిరిలోగల యాదాద్రి రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు త్వరలోనే మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైలు సదుపాయంకోసం 3వ లైన్‌ ట్రాక్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎంఎంటీఎస్‌ ఏర్పాటుతో సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రికి సుమారు 30 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉందన్నారు.

యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్‌
యాదాద్రి రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఎస్‌సీఆర్‌ జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

భువనగిరి రూరల్‌, జూలై 20: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్‌ రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. గురువారం భువనగిరి శివారులోని రాయిగిరిలోగల యాదాద్రి రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు త్వరలోనే మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైలు సదుపాయంకోసం 3వ లైన్‌ ట్రాక్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఎంఎంటీఎస్‌ ఏర్పాటుతో సికింద్రాబాద్‌ నుంచి యాదాద్రికి సుమారు 30 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా యాదాద్రి రైల్వేస్టేషన్‌లో రూ.4కోట్లతో చేపట్టనున్న రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులను, ప్యాసింజర్‌ షెడ్లు, టాయిలెట్స్‌, తదితర పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే ఈ పనులను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్లు ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజనల్‌ రైల్వే మేనేజర్లు అభయ్‌కుమార్‌ గుప్తా, బీకే గుప్తా, బి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T01:14:21+05:30 IST