శేఖర్ కుటుంబానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల పరామర్శ
ABN , First Publish Date - 2023-05-26T00:16:22+05:30 IST
పిడుగుపాటుకు గురై మృతి చెందిన మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన ఎల్లంకి శేఖర్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం సందర్శించి నివాళులర్పించారు.

సంస్థాన్ నారాయణపురం, మే 25: పిడుగుపాటుకు గురై మృతి చెందిన మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన ఎల్లంకి శేఖర్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా ఇదే ప్రమాదంలో గాయపడిన శేఖర్ కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు, శేఖర్ సోదరుడు వెంకటేష్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లమల కృష్ణారెడ్డి శేఖర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శేఖర్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ శేఖర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శేఖర్ కుటుంబానికి రూ. 2లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తానని ప్రకటించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సర్పంచులు కట్టెల బిక్షపతి, సురివి యాదయ్య, ఎంపీటీసీ ఈసం యాదయ్య, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు వీరమల్ల వెంకటేష్‌గౌడ్ తదితరులు ఉన్నారు.