అడ్డగూడూరులో మంత్రుల పర్యటన నేడు

ABN , First Publish Date - 2023-01-08T00:07:46+05:30 IST

అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.11.25 కోట్ల వ్యయంతో 15 వేల మెట్రిక్‌టన్నుల సామర్ధ్యం కల్గిన గోదాములను నిర్మించారు.

అడ్డగూడూరులో మంత్రుల పర్యటన నేడు

మోత్కూరు, జనవరి 7: అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.11.25 కోట్ల వ్యయంతో 15 వేల మెట్రిక్‌టన్నుల సామర్ధ్యం కల్గిన గోదాములను నిర్మించారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో తిరుమలగిరి వ్యాపారి ఇమ్మడి సోమనర్సయ్య ఆర్‌బీవో ప్లాంట్‌ నిర్మించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజనరెడ్డి, రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌, రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి ఈనెల 8న (ఆదివారం) అడ్డగూడూరు మండలంలో పర్యటించి, ఉదయం 10.30 గంటలకు ఇమ్మడి సోమనర్సయ్య ఆర్‌బీవో ప్లాంట్‌ను, 11 గంటలకు ప్రభుత్వ గోదాములను ప్రారంభింస్తారని బీఆర్‌ఎస్‌ అడ్డగూడూరు మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన పొన్నాల వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం చౌళ్లరామారం గ్రామంలో నిర్వహించనున్న మోత్కూరు, అడ్డగూడూరు మండలాల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

Updated Date - 2023-01-08T00:07:48+05:30 IST