దైవ చింతనతో మానసిక ప్రశాంతత : బొల్లం
ABN , First Publish Date - 2023-03-19T00:13:37+05:30 IST
దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.

కోదాడ రూరల్, చిలుకూరు, మార్చి 18 : దైవ చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో గంగాభ వాని మాత, లింగమంతులస్వామి దేవాలయ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతరలకు ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిం దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, సర్పం చ్ లీల అప్పారావు, బీఆర్‌ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, కాటంరెడ్డి ప్రసాద్‌రెడ్డి, బెజవాడ శ్రవణ్, మల్లెల పుల్లయ్య, చిర్ర ముత్తయ్య, గ్రామశాఖ అద్యక్షులు సతీష్, నాయకులు నిరంజన్, మల్లెల పిచ్చయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చిలుకూరులో సత్తెమ్మ తల్లి, ముత్యాలమ్మ దేవతల దేవాలయాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడారు బాబు, ఎంపీటీసీలు రమణ నాగయ్య, కళ్యాణి కోటేష్, పిల్లుట్ల శ్రీనివాస్, కందుకూరి ఉపేందర్, ముత్యాలు, వెంకటి, పిచ్చయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.