గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో వైద్య సేవలు
ABN , First Publish Date - 2023-07-21T01:37:15+05:30 IST
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పల్లె దవాఖానాలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.
మద్దిరాల, నాగారం, తుంగతుర్తి, జూలై 20: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం పల్లె దవాఖానాలను నిర్మిస్తోందని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచసీల) భవన నిర్మాణ పను లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామీణులు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాపించకుండా ప్రజలకు అవ గాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. మద్దిరాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్‌ఏ రజాక్, తహసీల్దార్ అమీన్‌సింగ్, ఎంపీడీవో సరోజ, డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్దన్, వైద్యాధికారులు కరుణసాగర్, అశ్రితరెడ్డి, సర్పంచ్‌లు ఇంతియాజ్‌ఖాతిన్‌బేగం, బరపటి ఉపేందర్, ఎంపీటీసీ నాగెళ్లి శ్రీలతశ్రవణ్‌కుమార్, నాయకులు రవీందర్‌రావు, నరసింహారావు, విష్ణువర్దన్‌రెడ్డి, ఆకుల ఉప్పలయ్య, గూడ వెంకట్‌రెడ్డి, గోల్కొండ మల్లేష్, నల్ల మధుసూదన్ పాల్గొన్నారు.
పార్టీ బీమా చెక్కు అందజేత
ఇటీవల మృతిచెందిన నాగారం మండలంలోని డి.కొత్తపల్లి గ్రామా నికి చెందిన గైగుళ్ల నర్సయ్య కుటుంబానికి మంజూరైన రూ.2లక్షలు బీఆర్‌ఎస్ సభ్వత్వ బీమా చెక్కు మంజూరైంది. ఈ చెక్కును తిరుమల గిరిలోని క్యాంపు కార్యాలయంలో నర్సయ్య భార్య ఎల్లమ్మకు ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ అందజేశారు కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కె.ఉప్పలయ్య, సర్పంచ యారాల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
సర్కారు పాఠశాల్లో కార్పొరేట్ స్థాయి విద్య
సర్కారు పాఠశాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కిషోర్‌కుమార్ అన్నారు. ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం కింద మండలంలోని వెలుగుపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.22లక్షలతో చేపట్టిన అభివృద్థి పనులు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని కోరారు. కార్యక్ర మంలో డీఈవె అశోక్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీంసింగ్, పంచాయతీరాజ్ డీఈ ప్రభాకర్, సింగిల్‌విండో చైర్మన గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టిపల్లి శ్రీశైలం, సర్పంచు మామిడి వెంకన్న, ఎంఈవో బోయిని లింగయ్య, ఏఈ రాంబాబు, ఎంపీటీసీ మట్టిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.