పాల్వాయి సృజమనికి పలువురి నివాళి

ABN , First Publish Date - 2023-09-22T00:18:26+05:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి దివంగత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సతీమణి సృజమని(78) అనా రోగ్యంతో బుధవారం మృతిచెందారు.

పాల్వాయి సృజమనికి పలువురి నివాళి
నివాళులర్పిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

చండూరు రూరల్‌, సెప్టెంబరు21: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి దివంగత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి సతీమణి సృజమని(78) అనా రోగ్యంతో బుధవారం మృతిచెందారు. హైదరాబాదులో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సృజమని పార్థివదేహానికి గురువారం పూలమాల వేసి నివాళుల ర్పించారు. మధ్యాహ్నం ఆమె భౌతికకాయాన్ని నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామానికి తీసుకొచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, కాంగ్రెస్‌ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి చలమల్ల కృష్ణారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సృజమని భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పాల్వాయి స్రవంతిని ఓదార్చి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

Updated Date - 2023-09-22T00:18:26+05:30 IST