కుటుంబ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-06-07T00:52:34+05:30 IST

కుటుంబ తగాదాలతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని కేసీఆర్‌ కాలనీలో మంగళవారం జరిగింది.

 కుటుంబ తగాదాలతో వ్యక్తి ఆత్మహత్య

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ, జూన్‌ 6: కుటుంబ తగాదాలతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని కేసీఆర్‌ కాలనీలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్‌లోని కేసీఆర్‌ కాలనీకి చెందిన పెనకంటి మధు(48) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసై భార్యా పిల్లలను వేధిస్తున్నాడు. దీంతో 10 రోజుల క్రితం భార్య లింగమ్మ లక్కారంలోని తల్లి గారి ఇంటికి వచ్చింది. మనస్తాపానికి గురై మధు మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధు భార్య లింగమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు. కాగా మధుకు నలుగురు పిల్లలు ఉన్నారు.

Updated Date - 2023-06-07T00:52:34+05:30 IST