భువనగిరి, బీబీనగర్ చెరువులకు మహర్దశ
ABN , First Publish Date - 2023-08-22T01:29:09+05:30 IST
భువనగిరి పెద్దచెరువుకు, బీనగర్ పెద్ద చెరువుకు మహర్దశ పట్టబోతోంది. హైదరాబాద్ మెట్రో పాలిటన డెవలప్ మెంట్ అథారిటీ (హెచఎండీఏ) భువనగిరి చెరువు సుందరీకరణకు రూ.11కోట్లు, బీబీనగర్ చెరువు సుందరీకరణకు రూ.6కోట్లు కేటాయించింది.
భువనగిరి టౌన/ బీబీనగర్, ఆగస్టు 21: భువనగిరి పెద్దచెరువుకు, బీనగర్ పెద్ద చెరువుకు మహర్దశ పట్టబోతోంది. హైదరాబాద్ మెట్రో పాలిటన డెవలప్ మెంట్ అథారిటీ (హెచఎండీఏ) భువనగిరి చెరువు సుందరీకరణకు రూ.11కోట్లు, బీబీనగర్ చెరువు సుందరీకరణకు రూ.6కోట్లు కేటాయించింది. బీబీనగర్ చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహా పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సోమవారం చెరువుకట్ట సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ది సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. రూ, 9.70 కోట్ల హెచఎండిఏ నిధులతో చేపడుతున్న భువనగిరి పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులకు, భువనగిరిలోని అర్బన కాలనీలో రూ. 1.45 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అర్బన హెల్త్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఊహించని స్థాయిలో భువనగిరి పట్టణాన్ని అభివృద్ది చేసామన్నారు. రెండు నెలలో భువనగిరి పట్టణం నూతన శోభను సంతరించుకోనున్నదన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో జడ్పీ చైర్మెన ఎలిమినేటి సందీప్ రెడ్డితో కలిసి 108 అంబులెన్స వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా ఆసుపత్రిలో మరిన్ని వైద్యసేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్మెన ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మెన చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన డాక్టర్ జడల అమరేందర్ గౌడ్, కౌన్సిలర్లు ఊదరి లక్ష్మీ సతీష్, నజియా జహంగీర్, డీఎంహెచఓ డాక్టర్ కె మల్లికార్జున రావు, డిసిహెచఎ్‌స డాక్టర్ చిన్నా నాయక్, మున్సిపల్ కమీషనర్ బి నాగిరెడ్డి, ఇరిగేషన డిఈ లావణ్య, హెచఎండిఏ అధికారులు పాల్గొన్నారు.