మట్టపల్లిలో వైభవంగా మహాలక్ష్మీయాగం

ABN , First Publish Date - 2023-05-06T23:53:07+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లోకకల్యాణార్థం శ్రీమాన్‌ వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో దేవస్థాన పాలక మండలి పర్యవేక్షణలో శ్రీసూక్త సహిత మహాలక్ష్మీయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మట్టపల్లిలో వైభవంగా మహాలక్ష్మీయాగం
హంస వాహనంలో విహరిస్తున్న ఉత్సవమూర్తులు

మఠంపల్లి, మే 6: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం లోకకల్యాణార్థం శ్రీమాన్‌ వాసుదేవాచార్యుల ఆధ్వర్యంలో దేవస్థాన పాలక మండలి పర్యవేక్షణలో శ్రీసూక్త సహిత మహాలక్ష్మీయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని మహాయాగం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు కృష్ణానదిలో హంస వాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహామూర్తి,సీతరామశాస్ర్తీ, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత, రాజష్‌, రమేష్‌ దేవస్థాన పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మాత్సవాల్లో నాలుగో రోజు..

మట్టపల్లి నృసింహుడి తిరుకల్యాణోత్సవంలో భాగంగా నాలుగో రోజు శనివారం ఉదయం 6గంటలకు ప్రాత:కాలార్చన, సుప్రభాతం, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, మూలవిరాట్‌ అభిషేకం, 9గంటలకు శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మి అమ్మవార్ల సహస్ర కుంకుమార్చన అనంతరం వేదపండితులు శ్రీసూక్త సహిత మహాలక్ష్మీయాగం నిర్వహించారు. రాత్రి 7గంటలకు కృష్ణానదీలో హంసవాహన సేవ వైభవంగా నిర్వహించారు.

Updated Date - 2023-05-06T23:53:07+05:30 IST