మగువకు అందలం

ABN , First Publish Date - 2023-09-19T23:46:22+05:30 IST

మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు మరోసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని సభ్యులను ఆయన కోరారు. బీజేపీకి సొంతంగా బలంగా ఉండడంతో పాటు విపక్షాలు సైతం ఈ బిల్లుకు సానుకూలంగా స్పందిస్తుండడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందన్న అంచనాలో అంతా ఉన్నారు.

మగువకు అందలం

చట్ల సభల్లో మహిళలకు 33 శాతం

పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ

30 ఏళ్ల కల సాకారం

2027 నుంచి అమలులోకి

ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌లో మహిళలదే ఆధిక్యం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు మరోసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ప్రధాని మోదీ మంగళవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని సభ్యులను ఆయన కోరారు. బీజేపీకి సొంతంగా బలంగా ఉండడంతో పాటు విపక్షాలు సైతం ఈ బిల్లుకు సానుకూలంగా స్పందిస్తుండడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుందన్న అంచనాలో అంతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉభయ సభల్లో ఆమోదం పొంది నా 2027 తర్వాతే ఈ చట్టం అమలులోకి రానుంది.

చట్ట సభల్లో 33శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లు సుమారు మూడు దశాబ్దాలుగా ఆమోదానికి ఎదురుచూస్తోంది. విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు చట్టంగా రూపం దాల్చితే చట్ట సభల్లో 15ఏళ్ల పాటు మహిళలకు రిజర్వేషన్లు అమలులో ఉంటా యి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్‌ ప్రక్రియలో రిజర్వ్డ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది. మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాక 15ఏళ్ల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత రిజర్వేషన్‌ శాతం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ కోటాలోనే ఎస్సీ, ఎస్టీ మహిళలకు మూడో వంతు సీట్లను కేటాయిస్తా రు. అయితే మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ, శాసనమండలికి వర్తించదు. ఈ బిల్లు చట్ట రూపం దా ల్చాక చేపట్టే నియోజకవర్గాల పునర్విభజ న అనంతరమే అమలులోకి వస్తుంది. డీలిమిటేషన్‌ ప్రక్రియ జరగాలంటే జనగణ న చేయాలి. 2021లోనే జనగణన చేయాల్సి ఉన్నా కొవిడ్‌ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2027 డీలిమిటేషన్‌ ప్రక్రియ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 12 నియోజకవర్గాలు ఉండగా, 2027లో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనలో వీటి సంఖ్య పెరగనుంది. ఈ ప్రక్రియ ముగిశాక మహిళా రిజర్వేషన్లు ఖ రారవుతాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మహిళలు అధికంగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో డీలిమిటేషన్‌ త దుపరి ఆ లెక్కలు కొంత తారుమారయ్యే అవకాశం ఉంది.

ఇక్కడ వారిదే ఆధిక్యం

ఈ ఏడాది జనవరి 5న ప్రచురించిన ఓటర్ల జాబితాను అనుసరించి ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్‌ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా, నల్లగొండ నియోజకవర్గంలో పురుషుల ఓట్ల సంఖ్య 1,10,222 కాగా, మహిళా ఓటర్లు 1,14,211 మంది, థర్డ్‌ జండర్‌ ఓట్ల సంఖ్య 25 మొత్తంగా 2,24,458 మంది ఓటర్లు ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్య 1,04,627 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,07,265, థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఆరుగురు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,11,898. నల్లగొండ జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. సూర్యాపేట జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ జిల్లాలో సగానికి సగం మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్య 1,13,056 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,17,299, థర్డ్‌ జండర్‌ ఓటర్లు నలుగురు కాగా, మొత్తం ఓటర్ల సంఖ్య 2,30,359. కోదాడ నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్య 1,10,998 కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,14,706, థర్డ్‌ జండర్‌ ఓటర్ల సంఖ్య 10 కాగా మొత్తం ఓటర్ల సంఖ్య 2,25,714. యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా అక్కడ పురుష ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది.

బిల్లును స్వాగతిస్తున్నాం : శంకర్‌నాయక్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, నల్లగొండ

మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ బిల్లు ను పార్లమెంట్‌లో మొదట ప్రవేశపెట్టిందే కాంగ్రెస్‌. నాడు బీహార్‌ నేతలు అడ్డుకోవడంతో ఆ బిల్లు వెనక్కి పోయింది. దేశ సమగ్రాభివృద్ధికి కట్టుబడిన కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లును స్వాగతిస్తోంది. మా పార్టీ రథసారధి ఒక మహిళ. ఈ బిల్లును పూర్తిగా సమర్ధిస్తున్నాం.

మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్న బీజేపీ : మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షనీయం. మహిళ ల అభ్యున్నతికి బీజేపీ పార్టీ కట్టుబడి ఉంది. భారతీయ సంస్కృతికి అనుగుణంగా మహిళల ను బీజేపీ పార్టీ ఎంతో గౌరవిస్తూ ప్రతి అడుగులోనూ వా రు ఎదిగేందుకు కృషి చేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

ఈ ఎన్నికల నుంచే అమలు చేయాలి : నెల్లికంటి సత్యం, సీపీఐ జిల్లా కార్యదర్శి, నల్లగొండ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఈ అసెంబ్లీ, వచ్చే పార్లమెం ట్‌ ఎన్నికల నుంచే అమలు చేయాలి. మహిళా బిల్లును స్వాగతిస్తున్నాం. అయితే 2027 నాటి నుంచి అమలు చేయడం వల్ల ఎంతో జాప్యం జరుగుతుంది. తక్షణమే ఈ ఎన్నికల నుంచే అమలులోకి తీసుకురావాలి. భారతదేశ సామాజికరంగ బీసీ మహిళా కోటా ఉంటే ఎం తో బాగుండేది. సామాజికపరంగా బీసీ మహిళల ఎదుగుదలకు దోహదపడి ఉండేది.

సుదీర్ఘ పోరాటంతో సాధ్యమైంది : ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి, నల్లగొండ

వామపక్ష పార్టీలు, మహిళా సంఘాల సుదీర్ఘ పోరాటంతో ఎట్టకేలకు మహిళా బిల్లు సాధ్యమైంది. చాలా ఆలస్యమైనప్పటికీ మహిళా బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడం స్వాగతించదగింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు సంవత్సరాలు తరబడి జాప్యం చేయడం వల్లే మహిళా బిల్లు ఇంతకాలం ఆమోదం పొందలేదు. ప్రస్తుత ప్రభుత్వం దేశంలో మెజార్టీ స్థానాలతో అధికారంలో ఉండడంతో మహిళా బిల్లు ఆమోదం సాధ్యమైంది.

Updated Date - 2023-09-19T23:46:22+05:30 IST