సామాజిక సేవలో మధునాయక్‌కు జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2023-09-04T01:40:21+05:30 IST
సామాజిక సేవారంగంలో వివిద రకాల సేవలందించినందుకు మండలంలోని కల్మెట్‌తండావాసి కేలావత మధునాయక్ సేవారత్న జాతీయ అవార్డు దక్కింది.
పాలకవీడు, సెప్టెంబరు 3: సామాజిక సేవారంగంలో వివిద రకాల సేవలందించినందుకు మండలంలోని కల్మెట్‌తండావాసి కేలావత మధునాయక్ సేవారత్న జాతీయ అవార్డు దక్కింది. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన పుడమి సాహితి వేదిక ఆద్వర్యంలో మధునాయక్‌కు ఈ అవార్డును భక్తరామదాసు పదో తరం వారసులు గిడుగు వెంకటనాగేశ్వరరావు, గిడుగు వెంకట, రాంమూర్తి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మధునాయక్ మాట్లాడుతూ ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. సేవాకార్యక్రమాలకు సహకరించిన కుటుంబ సభ్యులకు మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.