లక్కీ డ్రా స్కీం నిర్వాహకుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-06-26T00:42:05+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా స్కీంలు ని ర్వహిస్తూ ప్రజలను నమ్మించి వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశా రు.

లక్కీ డ్రా స్కీం నిర్వాహకుల అరెస్ట్‌

వలిగొండ, భూదాన్‌పోచంప ల్లి, జూన్‌ 25: నిబంధనలకు విరుద్ధంగా లక్కీ డ్రా స్కీంలు ని ర్వహిస్తూ ప్రజలను నమ్మించి వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశా రు. వలిగొండ మండలంలోని వె ల్వర్తి గ్రామానికి చెందిన కూచిమల్ల సుధాకర్‌, భగవంత్‌, నాగేష్‌ కలిసి శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఎంటర్‌ ప్రైజెస్‌ పేరు మీదతో లక్కీ డ్రా స్కీంను ప్రారంభించారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి వారిని నమ్మించి సుమారుగా 6వేల మంది వద్ద నుంచి రూ.500 చొప్పున వసూలు చేశారు. సదరు నిర్వాహకులు ఆదివారం వలిగొండ మండ ల కేంద్రంలోని సాయిగణేష్‌ ఫంక్షన్‌హాల్‌లో లక్కీ డ్రా తీసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్కా సమాచారంతో భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. వారి వద్ద నుంచి 6వేల లక్కీ డ్రా కాయిన్స్‌, బ్రోచర్‌, మూడు సెల్‌ఫోన్లు, రూ. 1.23 లక్షల నగదు, రెండు బిందెలు, నాలుగు బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్‌ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. సదరు నిర్వాహకుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్‌ తెలిపారు. అదే విధంగా పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలోని గునిగంట్ల వెంకటేశం వ్యవసాయ పొలం వద్ద లక్కీడ్రా నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్‌ వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2,060 నగదు, బ్యాంకులోని రూ. 1.91లక్షల నగదు, 1,444 లక్కీ డ్రా కాయిన్స్‌, నాలుగు సెల్‌ఫోన్లు, కారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూదాన్‌పోచంపల్లి ఎస్‌ఐ విక్రంరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-06-26T00:42:05+05:30 IST