లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-08-22T00:45:12+05:30 IST

లోక్‌అదాలత్‌ను సద్వినియోగంచేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి జిట్టా శ్యామ్‌కుమార్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి మారుతిప్రసాద్‌ కోరారు.

 లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
లోక్‌అదాలత సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి శ్యామ్‌కుమార్‌

హుజూర్‌నగర్‌, ఆగస్టు 21 : లోక్‌అదాలత్‌ను సద్వినియోగంచేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి జిట్టా శ్యామ్‌కుమార్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి మారుతిప్రసాద్‌ కోరారు. సోమవారం పట్టణంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజీపడ తగిన కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను కూడా సరిదిద్దుకోవాలన్నారు. న్యాయవాదులు పూర్తి సహకారం అందించాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, పీడీఎస్‌ బియ్యం తరలింపు కేసులను కూడా లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునేలా కృషి చేయాలని జడ్జిల దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్ళారు.కార్యక్రమంలో న్యాయవాదులు కాలువ శ్రీనివా్‌సరావు, చల్లా కృష్ణయ్య, రవి, బాలకృష్ణ, యాదగిరి, వీరయ్యయాదవ్‌, నర్సింహారావు, గోపాలకృష్ణమూర్తి, లతీ్‌ఫ,నాగార్జున సురే్‌ష,నగేష్‌, సైదులు, సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:45:12+05:30 IST