Share News

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం

ABN , First Publish Date - 2023-10-30T01:01:49+05:30 IST

ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రా జెక్టులను పూర్తి చేసుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అశ్వరావుపల్లి కాల్వ 80శాతం పూర్తయిందని,చొల్లేరు,బిక్కేరు, శామీర్‌పేట్‌ వా గులపై 30చెక్‌డ్యాంలు నిర్మించుకుందామని, మల్లన్నసాగర్‌ అలేరు నెత్తిమీది కుండలా ఉంటుందని, గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లలో 24గంటలు నీళ్లు ఉంటాయని,నాలుగు నెలల్లో బస్వాపూర్‌ మ త్తడి దుంకుతుందన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం

లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం

సునీత నా బిడ్డ ఆశీర్వదించండి

కిశోర్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలి

ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీ

యాదాద్రి, ఆక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రా జెక్టులను పూర్తి చేసుకుందామని సీఎం కేసీఆర్‌ అన్నారు. అశ్వరావుపల్లి కాల్వ 80శాతం పూర్తయిందని,చొల్లేరు,బిక్కేరు, శామీర్‌పేట్‌ వా గులపై 30చెక్‌డ్యాంలు నిర్మించుకుందామని, మల్లన్నసాగర్‌ అలేరు నెత్తిమీది కుండలా ఉంటుందని, గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లలో 24గంటలు నీళ్లు ఉంటాయని,నాలుగు నెలల్లో బస్వాపూర్‌ మ త్తడి దుంకుతుందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 29 చెక్‌డ్యాంలు నిర్మించామని, మరో 30వరకు నిర్మిస్తామన్నారు. దేవాదుల, బునాదిగాని కాల్వ, బస్వాపూర్‌ రిజర్వాయర్ల అనుసంధానంతో తుంగుతుర్తి నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో కోదాడ, తిరుమలగిరి, ఆలేరులో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ రాకముందు ఆలేరు కరువు ప్రాంతంగా ఉండేదని, సాగు, తాగునీరుకు నోచుకోక, బోర్లు ఎండిపోయి, ఒక్కో రైతు డజను బోరు వేసి అప్పులపాలై, గోసలు పడ్డారని అన్నారు. ఉద్యమ సమయంలో కొలనుపాకలో నిద్రచేశానని, కరువుతో వలసలు, పశువులకు గడ్డిలేక కబేళాలకు విక్రయించిన సంఘటనలు ఉండేవన్నారు. కరెంటు సమస్యతో బోరు మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు టపాకాయల్లా పేలిపోయాయన్నారు. తాను కూడా వ్యవసాయదారుడేనని, రైతుల బాధలను అర్థం చేసుకుని పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఈ ప్రాంతమంతా చెరువుల్లో నీరు లేక తుమ్మచెట్లు మొలిచేవని, నాటి సీఎంను ఒక్క ఎమ్మెల్యే కూడా నిలదీసిన పాపానపోలేదని విమర్శించారు. మిషన్‌కాకతీయ పథకంతో చెరువుల పటిష్టం చేసుకున్నామని, సాగు పెంచేందుకు ఆలేరు నియోజకవర్గంలో 29చెక్‌డ్యాంలు నిర్మించుకున్నామని తెలిపారు. ఒకప్పుడు యాసంగిలో 27వేల ఎకరాలు సాగు ఉండేదని, ప్రస్తుతం 2.16లక్షలకు చేరుకుందన్నారు. వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతుబంధు పథకాన్ని తెచ్చామని, రానున్న రోజుల్లో ఈ సాయాన్ని రూ.16వేలకు పెంచుతామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ వారు పదేళ్ల నుంచి ఆకలిగా ఉన్నారని, అధికారంలోకి వస్తే దళారులు, పైరవీల రాజ్యం స్థాపిస్తారని వెల్లడించారు. ఎన్నికలు వస్తే ఆవేశంతో ఉండకుండా, విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. సునీత తన బిడ్డ అని, ఆమెను ఆశీర్వదించాలన్నారు. ఆలేరు సభను చూసిన తర్వాత తాను ఏం మాట్లాడనవసరం లేదని, భారీసంఖ్యలో జనం వచ్చారని, డౌట్‌లేదు సునీత గెలుపు ఖాయమని అన్నారు. 2001లో తనకున్న పిడికెడు మందిలో సునీత ఒకరని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని, కలియుగ వైకుంఠధామంగా గొప్ప పుణ్యక్షేత్రాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. సునీతకు ఆలయ శిఖరమంత ఓట్లు డబ్బాలో పడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌కు బ్రహ్మాండమైన రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఆయనతో పాటు మాజీ ఎంపీపీ బబ్బూరి రవీందర్‌గౌడ్‌, బొందుగుల మాజీ సర్పంచ్‌ జూలకుంట్ల రామగోపాల్‌రెడ్డి, వెంకన్న బీఆర్‌ఎ్‌సలో చేరారు.

తుంగతుర్తిలో 2లక్షల ఎకరాలకు సాగునీరు

నల్లగొండ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తుంగతు ర్తి నియోజకవర్గం ఒకప్పుడు కరువు కాటకాలతో ఉండి, ఏ చెరువు చూసినా చారెడు నీరు కూడా ఉండేది కాదని, ప్రస్తుతం ఎండ కాలంలో కూడా ఒక్క వాన పడిపతే చెరువులు మత్తడిని దూకే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉద్యమ సమయంలో పలు సందర్భాల్లో తాను ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ‘గోదావరి జలాలు రావాలంటే బీఎన్‌రెడ్డిని గెలిపించాలి’ అనే నినాదాలు గోడల మీద కనిపించేవని, ఎన్ని పోరాటాలు చేసినా, ఏ ప్రభుత్వం కనికరించలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తీసుకరావడంతో 1.20లక్షల ఎకరాలకు సాగు నీరందుతోందన్నారు. గతంలో ఉన్న దుఖఃం, బాధ ఈ ప్రాంత రైతుల్లో ఇప్పుడు లేదన్నారు. దేవాదుల నీరు తిరుమలగిరి మండలంలోని ఏడెనిమిది గ్రామాలకు రావాల్సి ఉందని, ఆ పనులు జరుగుతున్నాయన్నారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాలకు నీరందించేందుకు బునాదిగాని కాల్వను వెడ ల్పు చేస్తున్నామని, వీటికి తోడు భు వనగిరిలోని బస్వాపూర్‌ ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తామన్నారు. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గానికి 2లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.

తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌ను లక్ష మెజారిటీతో గెలిపిస్తే నియోజకర్గం మొత్తానికి దళితబంధు అమలు చేస్తామన్నారు. ‘మీ ఎమ్మెల్యే కిశోర్‌ హుషారుగా ఉన్నాడు.. నాతో కొట్లాడి ఎక్కువ మంది దళితులు ఉన్న తిరుమలగిరి మండలాన్ని దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా పెట్టించుకున్నాడు.. ఆ తరువాత నియోజకవర్గం మొత్తం దళిత బంధు అమలు చేయాలని ఒత్తిడి తెచ్చాడు’ అని అన్నారు. కిశోర్‌ ఉద్యమ సమయంలో పోలీసుల దెబ్బలు తిని తన వెంట నడిచాడని వివరించారు. దంతాలపల్లికి పోతుంటే వెనకట దంతాలు ఊడిపోయేవని, ఎమ్మెల్యే కిశోర్‌, మంత్రి జగదీ్‌షరెడ్డి పట్టుబట్టి రోడ్డు వేయించారన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి పట్టుబట్టి దామరచర్లలో రూ.30వేల కోట్లతో ఆలా్ట్ర మెగా ప్రాజెక్టును ఏర్పాటుచేయించారన్నారు.

డాక్టర్‌ సాబ్‌ ప్రగతి భవన్‌కు రండి

సీఎం ప్రసంగ సమయంలో డాక్టర్‌ సుధాకర్‌ను గుర్తు చేశారు. శ్రీకాంతాచారి ఆత్మబలిదానం, సుధాకర్‌ లాంటి ఉద్యమకారులు పోలీసుల నిర్భంధంతోనే తెలంగాణ వచ్చింది తప్ప కాంగ్రెస్‌ నేతలతో కాదన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగం ముగించి వెళ్లే సమయంలో సుఽధాకర్‌ వద్దకు రాగానే ఆగి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి ‘డాక్టర్‌ సాబ్‌ మీరు ప్రగతి భవన్‌కు రండి.. ఉద్యమకారుల విషయాలతోపాటు.. ఇతర అంశాలు విస్తృతంగా మాట్లాడుకునేది ఉంది’ అంటూ వెళ్లిపోయారు.

జల దోపిడీ జరుగుతున్నా కాంగ్రెస్‌ నేతలు నోరుమూసుకున్నరు

సాగర్‌ప్రాజెక్టును దిగువన కట్టడంతో నష్టపోయిన తెలంగాణ

బలిసినోళ్లకు, బీసీలకు జరుగుతున్న ఎన్నికలివి

బీసీ నేత మల్లయ్యయాదవ్‌ను గెలిపించాలి

కోదాడ, కోదాడటౌన్‌: సమైక్యాంధ్రాలో జల దోపిడి జరుగుతున్నా నోరు మూసుకున్న దద్దమ్మలు కాంగ్రెస్‌ నేతలని సీంఎం కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయంటే కొందరు గాలి, గత్తర మాటలు మాట్లాడుతారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సమైక్య ఆంధ్రాలో పంటపోలాలు ఎండిపోతున్నాయని, కోదాడ ప్రాంత రైతులు నా దగ్గరకు వచ్చారని, దీంతో 2001లో కోదాడ నుంచి హాలియా వరకు రెండోసారి పాదయాత్ర చేశానన్నారు. సాగర్‌ ఆయకట్టుకు నీరు కావాలంటే ధర్నా, గొడవలు చేయాల్సి వచ్చేదన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును 20కిలోమీటర్ల పైన ఏల్లేశ్వరం వద్ద కట్టాల్సింది ఉందన్నారు. కానీ నాడు గోల్‌మాల్‌ చేసి కొందరు దిగువకు తీసుకొచ్చారన్నారు. దీంతో తెలంగాణకు తక్కువ నీళ్లు, వేరే ప్రాంతానికి ఎక్కువ వచ్చేలా కుట్ర జరిగిందన్నారు. అయినా నాడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నోరు మూసుకోవడంతోనే శిక్ష అనుభవిస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో మంత్రులు లేరా? నా కన్న రెండింతలు దొడ్డుకున్నోళ్లు, పొడుగున్నోళ్లు ఉన్నా నీటి కోసం ఎందుకు నోరు మెదపలేదన్నారు. మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లయ్యయాదవ్‌, సైదిరెడ్డి ఇక్కడి పొలాలు ఎండుతున్నాయని నా దృష్టికి తీసుకురావటంతో సాగర్‌ నిండకపోయినా నీటిని విడుదల చేసినట్టు తెలిపారు. అది బీఆర్‌ఎ్‌సకు రైతులపై ఉన్న చిత్తశుద్ధి అన్నారు. మరో దఫా నీరు వదిలితే పంట చేతికొస్తుందని రైతుల దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. కోదాడ సాగర్‌ ఆయకట్టు కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాకు కాళేశ్వరంతో లింక్‌ కలిపి నీరు ఇస్తానని అన్నారు. ఆసి్‌ఫనగర్‌ కెనాల్‌ నుంచి ఉదయసముద్రం దాకా నీరు వస్తుందని, అక్కడి నుంచి కాళేశ్వరం జలాలు మూసీ దాటించి ఉదయసముద్రంలో పడేస్తే అక్కడి నుంచి పెద్దచెరువు, దేవులపల్లిలో కలుస్తాయన్నారు. దీంతో కోదాడకు, హుజూర్‌నగర్‌కు నీళ్లు వస్తాయన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో అనుసంధానం చేసి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు శాశ్వతంగా నీరు ఇస్తామన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్ద నాయకుడు, ప్రజలు కట్టే పన్నులతో కేసీఆర్‌ రైతుబంధు ఇస్తున్నాడంటున్నాడని, రైతుబంధు వేస్టా? రైతుబంధు ఉండాలా? వద్దా? అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. కోదాడ, సూర్యాపేట మధ్యలో వేల ఎకరాల్లో డ్రైపోర్టులు ఏర్పాటుచేస్తామన్నారు.

బలిసినోళ్లకు, బీసీలకు జరుగుతున్న ఎన్నికలివి

విద్యావంతుడు, బీసీ నాయకుడు మల్లయ్మయాదవ్‌కు టికెట్‌ ఇవ్వొద్దని, గెలవడంటూ తన దగ్గరకు కొందరు వచ్చారన్నారు. అయినా మల్లయ్యయాదవ్‌కు టికెట్‌ ఇచ్చానని, బలిసినోళ్లకు, బీసీలకు జరుగుతున్న ఎన్నికల పోరాటంలో బీసీలు, దళితులు, లంబాడీలు, ముస్లింలు, మైనార్టీలు ఐకమై ఆయన్ను గెలిపించుకోవాలన్నారు. మల్లయ్యయాదవ్‌ను గెలిపించుకుంటే రూ.10కోట్లతో కోదాడ బీసీ భవనం కట్టిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా దళితులు, ఎస్టీలు, ముస్లింలు, మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. కాగా, మలి ఉద్యమకారుడు వక్కవంతుల విజయకుమార్‌ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ హెలీప్యాడ్‌ వద్దకు తీసుకెళ్లి సీఎంతో మాట్లాడించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని సీఎం ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

సభల్లో మంత్రి జగదీ్‌షరెడ్డి, రాజ్యసభసభ్యుడు బి.లింగయ్యయాదవ్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, నార్మాక్స్‌ చైర్మన్‌ లింగాల శ్రీకర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్‌, ఆల్డా చైర్మన్‌ పిచ్చిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడిమహేందర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌, చింతకాయల దినే్‌షకుమార్‌, ప్రజా గాయకుడు సోమన్న, మోతె సోమిరెడ్డి, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికయుగందర్‌రావు, ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, వైస్‌చైర్మన్‌ బద్దు నాయక్‌, బీరవోలు సోమిరెడ్డి, ఎస్‌ఏ.రజాక్‌, మదర్‌ డెయిరీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, సీహెచ్‌.వెంకటరాంరెడ్డి, ఆర్కాల గాల్‌రెడ్డి, గంగుల శ్రీనివాస్‌, పుట్ట మల్లేశ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, హేమేందర్‌, వైస్‌ చైర్మన్‌ మాధవి వెంకటేశ్‌, గడ్డమీది రవీందర్‌ గౌడ్‌, జ్యోతి ప్రవీణ్‌, పోరెడ్డి శ్రీనివాస్‌, మల్లేశం, చింతకింది చంద్రకళ, బాలస్వామి పాల్గొన్నారు.

నా చర్మంతో కేసీఆర్‌కు చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనిది

- ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ఆలేరు: నా చర్మం వలిచి సీఎం కేసీఆర్‌కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిదని ఆలేరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. నాడు 27వేల ఎకరాలకు మాత్ర మే సాగుకు నోచుకుంటే నేడు నియోజకవర్గంలో 2.16లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నా రు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులు ఆయన దార్శనికతకు నిదర్శనమన్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి, మెడికల్‌ కళాశాల ఆలేరుకు గొప్ప వరమన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, 30 పడకల ఆస్పత్రిని 100పడకలకు అప్‌గ్రేడ్‌ చేయాలని, రఘునాధ్‌పూర్‌, బొమ్మలరామారం మండలంలోని మాదాపూర్‌ను మండలాలుగా ప్రకటించాలని, తుర్కపల్లి, ఆత్మకూర్‌(ఎం) మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు.

తుంగతుర్తిలో నాడు నెత్తుటేరులు పారేవి

- తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌

మోత్కూరు: తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతూ నెత్తుటేరులు పారేవని, ఎటు చూసినా సమాధులే కనిపించేవని తుంగతుర్తి ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు నాడు ఉద్యమంలో పాల్గొని 172 కేసులు ఎదుర్కొన్నానని, ఐదారు మా సాలు జైలు శిక్ష అనుభవించానన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014, 2018 ఎన్నిక ల్లో సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించి ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పిస్తే, ప్రజుల ఆశీర్వదించి గెలిపించారన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో గోదావరి జలాలు తీసుకురావడంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైందన్నారు. ప్రస్తుతం సుమా రు 1.30లక్షల ఎకరాలు సాగవుతున్నాయన్నారు. ఎండాకాలంలో సైతం చెరువులు నిండి అలుగులు పోస్తున్నాయన్నారు. తిరుమలగిరి మండలంలోని దళితులందరికీ దళితబంధు అందిందన్నారు. కేసీఆర్‌ తనకు మరోసారి పోటీచేసే అవకాశం ఇచ్చినందున, భారీ మెజార్టీతో గెలిపించడంతోపాటు కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి చేయాలన్నారు.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

కోదాడ: నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి పార్టీలకతీతంగా అందుతున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని, నాయకులు, కార్యకర్తల కృషితో రెండోసారి కోదాడలో గులాబీజెండా ఎగురవేస్తామని ఎమ్యెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. కొంతమంది నా యకులు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఏమీకాదని, తనకు అన్ని వర్గాల సహకారం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా ఉందన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమం అందుతోందని, మరిన్ని పథకాలు రావాలంటే బీఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో రైతుబంధు అదనంగా ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. పెన్షన్‌, దళితబంధు, ఇతర పథకాలు అందరికీ అందుతున్నాయన్నారు. గృహలక్ష్మి, దళితబంధు అందుకున్నవారు, అందుకోనున్నవారు తమకే ఓటు వేస్తారని, గులాబీ జెండా ఎగరనుందన్నారు. మోతె, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలు అందించాలని ముఖ్యమంత్రిని కోరానని, మంత్రి జగదీ్‌షరెడ్డి సహకారంతో దీన్ని పూర్తిచేయిస్తానని అన్నారు. పార్టీ శ్రేణుల సహకారంతో సభ విజయవంతం అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-10-30T01:01:49+05:30 IST