సొంతింటి కలను నెరవేరుస్తున్న కేసీఆర్
ABN , First Publish Date - 2023-09-22T00:34:23+05:30 IST
పేదలకు సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు.
నూతనకల్, అర్వపల్లి, నాగారం, సెప్టెంబరు 21: పేదలకు సొంతింటి కలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ అన్నారు. గురువారం నూతనకల్‌లో, అర్వపల్లిలో 249 మందికి, నాగారంలో 274మందికి గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తామ న్నారు. నూతనకల్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతిసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాళ దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన కనకటి వెంకన్న, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, పీడీ కిరణ్‌కుమార్, ఆర్డీవో వీరబ్రహ్మాచారి, ఎంపీడీవో ఇందిర, ప్రజాప్రతినిధులు, అర్వపల్లిలో ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్, మార్కెట్ చైర్‌పర్సన స్రవంతి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఉమేష్, పీఏసీఎస్ చైర్మన కుంట్ల సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గుండగాని సోమే్‌ష్‌గౌడ్, నాగారంలో ఎంపీపీ కురం మణివెంకన్న, తిరుమలగిరి మార్కెట్ ఛైర్మన కొమ్మినేని స్రవంతి, వైస్ చైర్మన యారాల రాంరెడ్డి, వైస్ ఎంపీపీ గుంటకండ్ల మాణిమాల, గుండగాని అంబయ్యగౌడ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కె.ఉప్పలయ్య, తహసీల్దార్ వి.బ్రహ్మయ్య, ఎంపీడీవో జి.శోభరాణి, సర్పంచలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.