మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం

ABN , First Publish Date - 2023-03-25T23:11:27+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా దొంతగాని లక్ష్మమ్మ, వైస్‌చైర్మన్‌ రామలింగారెడ్డి, డైరెక్టర్లతో మార్కెట్‌ కార్యదర్శి సంగయ్య ప్రమాణ శ్రీకారం చేయించారు.

మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం
మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకార సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్‌నగర్‌ , మార్చి 25 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండడం ఖాయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా దొంతగాని లక్ష్మమ్మ, వైస్‌చైర్మన్‌ రామలింగారెడ్డి, డైరెక్టర్లతో మార్కెట్‌ కార్యదర్శి సంగయ్య ప్రమాణ శ్రీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సైదిరెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీని పార్లమెంట్‌ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌ నుంచి మాట్లాడే నాయకుడు ఒక్కడూ లేడన్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రమే రాహుల్‌ గాంధీకి అండగా ఉన్నాడన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో, దేశంలో చనిపోయిందన్నారు. మోదీని ఎదుర్కొనే దమ్ము కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు ఎన్నికలప్పుడే ప్రజలు బిడ్డలంటూ వస్తారని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో రైస్‌మిల్లర్లు తరుగు తీస్తే సహించబోమన్నారు. వచ్చే ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉంటాయని కార్యకర్తలు ఇప్పటి నుండే సిద్ధం కావాలన్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో సాగర్‌లో నీళ్లున్నా రెండో పంటకు ఇస్తారన్న నమ్మకం ఉండేది కాదన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటల విద్యుత ఇస్తున్నామని, ఎరువుల కొరత లేదన్నారు. సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో వలసలు నిలిచిపోయాయన్నారు. అంతకుముందు కౌండిన్య ఫంక్షన్‌ హాల్‌ నుంచి ఇందిరాసెంటర్‌ మీదుగా మార్కెట్‌ యార్డు వరకు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ దొంతగాని శ్రీనివా్‌సగౌడ్‌ ఆఽధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకారెడ్డి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమరనాధ్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చన, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, కేఎల్‌ఎన్‌రెడ్డి, చంద్రకళ, సైదిరెడ్డి, కడియం వెంకటరెడ్డి, జయబాబు, శ్రీలతారెడ్డి, అప్పి రెడ్డి, రంగాచారి, ఫణికుమారి, శంభయ్య, కేఎల్‌ఎన్‌రావు, సతీష్‌, గాయత్రీ, కొమ్ము శ్రీను, శ్రీనివా్‌సరెడ్డి, ప్రజాప్రతినిధులు, డీసీసీబీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:11:27+05:30 IST