చోరీ కేసులో ఏడాది జైలు

ABN , First Publish Date - 2023-06-06T01:32:36+05:30 IST

చోరీ కేసులో ఓ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి షాలిని సోమవారం తీర్పు చెప్పారు.

చోరీ కేసులో ఏడాది  జైలు

తుంగతుర్తి, జూన 5: చోరీ కేసులో ఓ నిందితుడికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తుంగతుర్తి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి షాలిని సోమవారం తీర్పు చెప్పారు. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మామిడి శ్రీకాంత 2022 నవంబరులో తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన మూల వెంకట్‌రెడ్డి, గుండా నవీన ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్ల చోరీ చేశాడు.అప్పటి ఎస్‌ఐ శివకుమార్‌ కేసు నమోదు చేశారు. నిందితుడు చోరీ చేసినట్లు కోర్టులో రుజువు కావడంతో ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Updated Date - 2023-06-06T01:32:36+05:30 IST