గడువులోగా ఐటీ10-ఏ దాఖలు చేయాలి
ABN , First Publish Date - 2023-08-22T23:52:05+05:30 IST
ఆదాయపు పన్నుకు సంబంధించి ఫారం- 10ఏను సెప్టెంబరు 30వ తేదీ లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్నుశాఖ జిల్లా అధికారి వి.సూర్యనారాయణమూర్తి అన్నారు.
సూర్యాపేట టౌన, ఆగస్టు 22: ఆదాయపు పన్నుకు సంబంధించి ఫారం- 10ఏను సెప్టెంబరు 30వ తేదీ లోపు దాఖలు చేయాలని ఆదాయపు పన్నుశాఖ జిల్లా అధికారి వి.సూర్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదాయపు పన్నుశాఖ కార్యాలయంలో ఫారం 10-ఏ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆదాయ పన్ను చట్టాలు, నూతన సవరణలు, మినాయింపులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని తెలిపారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు, ఐటీఐఆర్-7, ఫారం 10-ఏ, 10-బిలను గడువులోగా అందజేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కె.సాయిశంకర్, ఇనస్పెక్టర్లు రవి, కె.మహేష్, ఎం.సాయికుమార్, డీఎల్ మారుతిప్రసాద్, అడిటర్లు, అకౌంటెంట్లు పాల్గొన్నారు.