కుల వృత్తులకు జీవం పోసింది కేసీఆరే

ABN , First Publish Date - 2023-10-08T00:49:54+05:30 IST

అంతరించిపోతున్న కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్‌ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కేసారం గ్రామ శివారులో రజక, బట్రాజు, మేదరి సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయా వర్గాల ఆత్మగౌరవం పెంచేందుకు సంక్షేమ భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

కుల వృత్తులకు జీవం పోసింది కేసీఆరే

మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

సూర్యాపేటరూరల్‌, అక్టోబరు 7: అంతరించిపోతున్న కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్‌ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కేసారం గ్రామ శివారులో రజక, బట్రాజు, మేదరి సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం కల్పిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆయా వర్గాల ఆత్మగౌరవం పెంచేందుకు సంక్షేమ భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చేందుకు రూ.1లక్ష ఆర్థికసాయం అందిస్తున్నారన్నారు. గత పాలకుల హయాంలో కరువు కటకాలు, దరిద్రంతో అలమటించిన జిల్లా సీఎం కేసీఆర్‌ పాలనలో దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు, వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు

సూర్యాపేట(కలెక్టరేట్‌): ఐటీ హబ్‌తో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దురాజ్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లో తెలంగాణ అకాడమి ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమంలో ఆయన మాట్లాడారు. టాస్క్‌ ఆధ్వర్యంలో 45రోజుల పాటు మొదటి బ్యాచ్‌లో 500మందికి ఆదివారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. త్వరలో జిల్లాలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ద్వారా 10వేల మంది కి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికైన 50 మందికి ఉద్యోగ నియామక పత్రాలు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి అం దజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, అదనపు కలెక్టర్‌ సీహెచ్‌.ప్రియాంక, టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌సిన్హా, ఆర్డీవో వీరబ్రహ్మాచారి, తసీహల్దార్‌ శ్యాం, రంగారావు, సుందర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, ఉపాధికల్పన అధికారి మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసి గెలిపించాలి

పెన్‌పహాడ్‌: కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని,అది చూసి తనకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి అన్నారు. శుక్రవారం రాత్రి పెన్‌పహాడ్‌ మండలం దోసపహాడ్‌ గ్రామ పరిధిలో జంగాల కాలనీలో రూ.403.20లక్షలతో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి, సీడీపీ నిధులు రూ.10లక్షలతో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గద్దల నాగరాజు, సర్పంచ్‌ దొంగరి సుధాకర్‌, ఉప సర్పంచ్‌ కొండేటి రాంబాబు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-10-08T00:49:54+05:30 IST