వానలతో ఇబ్బందులు లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2023-07-21T00:40:15+05:30 IST

అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులుపడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

వానలతో ఇబ్బందులు లేకుండా చూడాలి
సూర్యాపేటలో పొంగులేటికి స్వాగతం పలుకుతున్న పటేల్‌ రమేష్‌రెడ్డి

సూర్యాపేట రూరల్‌, జూలై 20 : అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులుపడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేటలోని హోటల్‌ సెవెన వద్ద ఆయనకు టీపీసీసీ ప్రదాన కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖను అప్రమత్తం చేసి అంటురోగాల బారిన పడకుండా అన్ని ప్రాంతాల్లో వైద్యసిబ్బందిని అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. శ్రీనివా్‌సరెడ్డికి స్వాగతం పలికిన వారిలో స్ర్పైడ్‌ ఇండియా చైర్మన ఎనఆర్‌ఐ పటేల్‌ శ్రీధర్‌రెడ్డి, నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్‌, పెద్దిరెడ్డి రాజా, షఫీఉల్లా, రంగారెడ్డి, ఎడ్ల వీరమల్లు, నేరేళ్ల మధు, స్వామి నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T00:40:15+05:30 IST