‘విజ్ఞాన్‌’లో ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో

ABN , First Publish Date - 2023-03-25T23:57:01+05:30 IST

విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టె క్నాలజీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ(విట్స్‌) దేశ్‌ముఖిలో శనివారం ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టు ఎక్స్‌పో నిర్వహించారు.

‘విజ్ఞాన్‌’లో ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పో
విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్‌

భూదాన్‌పోచంపల్లి,మార్చి 25: విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టె క్నాలజీ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ(విట్స్‌) దేశ్‌ముఖిలో శనివారం ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టు ఎక్స్‌పో నిర్వహించారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌,మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐఐఎంఎల్‌, డాటాసైన్ను, ఐఐ అండ్‌ డాటా సైన్స్‌ నుంచి బీటెక్‌ విద్యార్థు లు పాల్గొని ప్రాజెక్టులను ప్రదర్శించారు. విజ్ఞాన్‌ సంస్థల సీఈవో బోయపాటి శ్రావణ్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక సాంకేతికతను పెంపొందించుకుని తమ లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యార్థుల లక్ష్యాల సాధనకు ఈ ఎక్స్‌పో ఒక వేదిక అని అన్నారు. స్త్రీల భద్రత, సౌరశక్తి, బ్యాటరీ టెక్నాలజీ, హోమ్‌ ఆటోమిషన్‌, డ్రోన్‌ టెక్నాలజీ, రాడార్‌ల కు సంబంధించిన 238 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వివిధ కళాశాలలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు హాజరై ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జి. దుర్గాసుకుమార్‌,హెచ్‌వోడీలు, అధ్యాపకులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:57:01+05:30 IST