అద్దె చెల్లించడం లేదని ఐసీడీఎస్‌ కార్యాలయానికి తాళం

ABN , First Publish Date - 2023-06-01T01:12:34+05:30 IST

అద్దె చెల్లించడం లేదని ఐసీడీఎస్‌ కార్యాలయానికి యజమాని తాళం వేశారు. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన కాశీనాథ్‌ తన ఇంటిని ఐసీడీఎస్‌ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. కాగా, 15 నెలలుగా ఇంటి అద్దె రాకపోవడంతో బుధవారం సాయంత్రం కార్యాలయానికి తాళం వేశాడు.

అద్దె చెల్లించడం లేదని ఐసీడీఎస్‌ కార్యాలయానికి తాళం
కార్యాలయానికి తాళం వేసిన యజమాని

చింతపల్లి, మే 31: అద్దె చెల్లించడం లేదని ఐసీడీఎస్‌ కార్యాలయానికి యజమాని తాళం వేశారు. చింతపల్లి మండల కేంద్రానికి చెందిన కాశీనాథ్‌ తన ఇంటిని ఐసీడీఎస్‌ కార్యాలయానికి అద్దెకు ఇచ్చాడు. కాగా, 15 నెలలుగా ఇంటి అద్దె రాకపోవడంతో బుధవారం సాయంత్రం కార్యాలయానికి తాళం వేశాడు. ఆ సమయంలో సీడీపీవో సూపర్‌వైజర్లు దేవరకొండలో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లారు. దీంతో కార్యాలయ సిబ్బంది సీడీపీవో లావణ్యకుమారికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. సీడీపీవో యజమానితో మాట్లాడి జిల్లా పీడీకి సమాచారం తెలియజేయడంతో పాటు త్వరలో ఇంటి అద్దె చెల్లించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అతడు ఐసీడీఎస్‌ కార్యాలయానికి వేసిన తాళాన్ని తీయడంతో కథ సుఖాంతమైంది.

Updated Date - 2023-06-01T01:12:34+05:30 IST