మానవ సంబంధాలను పెంపొందించాలి
ABN , First Publish Date - 2023-04-04T00:53:11+05:30 IST
శాస్త్ర విజ్ఞానం.. మానవ సంబంధాలు పెంపొందించేవిధంగా ఉండాలని ఇస్రో శాస్త్రవేత్త శివప్రసాద్ సూచించారు.
భువనగిరి రూరల్, ఏప్రిల్ 3: శాస్త్ర విజ్ఞానం.. మానవ సంబంధాలు పెంపొందించేవిధంగా ఉండాలని ఇస్రో శాస్త్రవేత్త శివప్రసాద్ సూచించారు. మండలంలోని అనంతారంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో సోమవారం చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనల గురించి విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఏ రంగంలోఅయినా ఉపగ్రహాలు లేనిది జీవించే పరిస్థితి లేదన్నారు. అలాంటి ఉపగ్రహాలను విజయవంతంగా ఒకేసారి 114 శాటిలైట్స్ ఒకే రాకెట్‌లో అమర్చి అంతరిక్షంలోకి పంపించే సత్తా భారతదేశం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రెడ్డి, డీడబ్ల్యూవో సుభాషిణి, అనురాధ, విద్యార్ధులు ఉన్నారు.