సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించడంపై హర్షం

ABN , First Publish Date - 2023-08-22T23:59:22+05:30 IST

సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్లు కేటాయిస్తూ సీఎం కేసీ ఆర్‌ ప్రకటన చేయడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం హర్షం వ్యక్తం చేశాయి.

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించడంపై హర్షం
మంత్రి, ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్న తిరుమలగిరి బీఆర్‌ఎస్‌ నేతలు

నడిగూడెం, మునగాల రూరల్‌, తిరుమలగిరి రూరల్‌, తిరుమల గిరి, ఆగస్టు 22: సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్లు కేటాయిస్తూ సీఎం కేసీ ఆర్‌ ప్రకటన చేయడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు రెండోసారి టికెట్‌ కేటాయిస్తూ సీఎం ప్రకటన చేయడంపై బీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు నడిగూడెం బస్టాండ్‌ సెంటరులో బాణసంచా కాల్చారు. బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోదాడకు వెళ్లి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతిమధుబాబు, సర్పంచ నాగలక్ష్మీమల్లే్‌షయాదవ్‌ పాల్గొన్నారు.

-కోదాడ అసెంబ్లీ టికెట్‌కు బొల్లం మల్లయ్యయాదవ్‌ పేరును ప్రకటించడంపై మునగాల మండలంలోని రేపాల మాజీ ఎంపీటీసీ బత్తుల ఉషా శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు.

- తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ పేరును సీఎం ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తిరుమలగిరి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దూపటి రవీందర్‌, తెడ్డు భాస్కర్‌, యాకూబ్‌నాయక్‌, బొడ్డు సైదులు, ఎ తదితరులు ఎమ్మెల్యేని కలిసి అభినందలు తెలిపి, మూడోసారి గెలిపించుకుంటామన్నారు.

- ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌కు టికెట్‌ ప్రకటనపై తిరుమలగిరి నుంచి బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడ్లు రఘునందనరెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్‌, తిరుమని యాదగిరి, భాస్కర్‌, లక్ష్మయ్య, బత్తుల శ్రీను తదితరులు హైదరాబాద్‌లో మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ను కలిసి శుబాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-08-22T23:59:22+05:30 IST