చేనేత వస్త్రాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:06 AM
మోత్కూరు ఇక్కత్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్రాలయాన్ని (షోరూమ్ ను) మరింత అభివృద్ధి చేయాలని నిమ్స్‌మి డైరెక్టర్ జనరల్ గోలి స్వరూప అన్నారు. శనివారం వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతూ మోత్కూరులో ఇక్కత్ హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను, చేనేత వస్త్రాలయాన్ని ఆమె సందర్శించా రు.
నిమ్స్‌మి డైరెక్టర్ జనరల్ స్వరూప
మోత్కూరు, డిసెంబరు 16: మోత్కూరు ఇక్కత్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత వస్త్రాలయాన్ని (షోరూమ్ ను) మరింత అభివృద్ధి చేయాలని నిమ్స్‌మి డైరెక్టర్ జనరల్ గోలి స్వరూప అన్నారు. శనివారం వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతూ మోత్కూరులో ఇక్కత్ హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను, చేనేత వస్త్రాలయాన్ని ఆమె సందర్శించా రు. వస్త్రాలయంలో రోజు ఎంత విక్రయిస్తున్నారు, ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. చేనేత మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను ఆమె పరిశీలించి, కార్మికులను ఈ కేంద్రం ద్వారా ఉపాధి లభిస్తుందా?, రోజుకు ఎంత గిట్టుబాటు అవుతుందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వస్త్రాలయంలో అన్ని రకాల వస్త్రాలు లభించేలా అభివృద్ధి చేయాలన్నారు. 2016లో రూ.1.73కోట్లతో స్ఫూర్తి పథకంలో ప్రారంభించిన సిల్క్ శిక్షణ, ఉత్పత్తి కేంద్రానికి ప్రభుత్వం అందించే సహాయం పూర్తయ్యిందని, ఇక ఈ పరిశ్రమను చేనేత కార్మికులే అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య, స్ఫూర్తి చైర్మన్ మంచె గోవర్ధన్, చేనేత సహకార సంఘం మేనేజర్ నర్సయ్య ఆమె వెంట ఉన్నారు.