గుట్ట ఈవోను వెంటనే తొలగించాలి
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:04 AM
యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్లను వెంటనే తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదవి విరమణ పొందిన అధికారుల ను ప్రభుత్వం విధుల్లో కొనసాగిస్తుందని, దీంతో వై టీడీఏ అభివృద్ధిలో అవినీతి జరిగిందన్నా రు.
సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు
యాదగిరిగుట్టరూరల్,డిసెంబరు16: యాదగిరిగుట్ట దేవస్థాన ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్లను వెంటనే తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదవి విరమణ పొందిన అధికారుల ను ప్రభుత్వం విధుల్లో కొనసాగిస్తుందని, దీంతో వై టీడీఏ అభివృద్ధిలో అవినీతి జరిగిందన్నా రు. వెంట నే విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకొని కొండపైన ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరా రు.కొండపైకి ఆటోలను అనుమతించాలన్నారు. అ నంతరం నూతన సీపీఐ మండల కార్యదర్శిగా కల్లెపల్లి మహేందర్‌ను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, కార్యవర్గసభ్యులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, చెక్క వెంకటేశ్, సహాయ కార్యదర్శి పేరబోయిన మహేందర్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, పెంటయ్య, పేరబోయిన బంగారి పాల్గొన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
భువనగిరి రూరల్: ప్రభుత్వ స్థలాలను పేదల కు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీ రాములు డిమాండ్‌చేశారు. శనివారం మండలంలో ని హన్మాపురం రెవెన్యూ పరిధిలోని 28 సర్వే నెంబర్‌లో గల 76ఎకరాల ప్రభుత్వ భూమిలో హద్దు రాళ్లను ఏర్పాటు చేసి ఇండ్లు లేని నిరుపేదలందరికీ స్థలాలు కేటాయించాలన్నారు. ఆ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టిని తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ, వెంటనే స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం చేపట్టి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, దాసరి లక్ష్మయ్య, గ్రామస్థులు యాదగిరి, సుజాత, రంగమ్మ, దుర్గాభవానీ, బాలకృష్ణ, అచ్చయ్య పాల్గొన్నారు.