33వ మండలంగా గుడిపల్లి

ABN , First Publish Date - 2023-08-07T00:57:32+05:30 IST

జిల్లాలోని గుడిపల్లిని కొత్తగా మండలంగా ఏర్పాటుచే స్తూ ప్రభుత్వం శనివారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీఏపల్లి మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ గుడిపల్లిని 11 పంచాయతీలతో కలిపి జిల్లాలో 33వ మండలంగా ఏర్పాటుకు పూనుకోవడంతో ఆదివారం గుడిపల్లి గ్రామంలో పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు.

33వ మండలంగా గుడిపల్లి

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 6: జిల్లాలోని గుడిపల్లిని కొత్తగా మండలంగా ఏర్పాటుచే స్తూ ప్రభుత్వం శనివారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీఏపల్లి మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ గుడిపల్లిని 11 పంచాయతీలతో కలిపి జిల్లాలో 33వ మండలంగా ఏర్పాటుకు పూనుకోవడంతో ఆదివారం గుడిపల్లి గ్రామంలో పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. మండల సాధన సమితి ఆధ్వర్యంలో సంబరా లు నిర్వహించారు. 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయంలో మండలాల ఏర్పాటులో చివరి క్షణంలో గుడిపల్లి మండలం ఏర్పాటు త్రుటిలో తప్పింది. మండల ఏ ర్పాటుకు అవసరమైన స్థలం, ఆస్పత్రి, పోలీ్‌సస్టేషన్‌, గ్రంఽథాలయం, జడ్పీహెచ్‌ఎ్‌స, ప్రా థమిక పాఠశాలలు, ఎస్‌బీఐ బ్యాంక్‌, తపాల కార్యాలయం, పీఏసీఎస్‌ కార్యాలయాలున్నా మండలం ఏర్పాటుకు నోచుకోలేదు. నాటి నుంచి పీఏపల్లి మండలంలో కొనసాగుతోంది. ఏడాది క్రితం గుడిపల్లి పరిసర ప్రాంత ప్రజలు మండల ఏర్పాటుకు రిలే నిరాహారదీక్ష లు నిర్వహించారు. సుమారు 371 రోజుల పాటు దీక్ష నిర్వహించి నిరసన తెలిపారు. మండల సాధన సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, గుడిపల్లి సర్పంచ్‌ శీలం శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల సాధన సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, మంత్రి జగదీ్‌షరెడ్డి సహకారంతో మండల ఏర్పాటుకు కృషి చేశారు. మండల ఏర్పాటుపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులు తెలియజేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో కోరింది.

పుల్యాతండా గ్రామపంచాయతీగా ఏర్పాటు

పెద్దవూర: మండలంలోని పుల్యాతండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిమ్మానాయక్‌తండా గ్రామపంచాయతీలో భాగం గా ఉన్న పుల్యాతండాను వేరు చేసి నూతన పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అభ్యంతరాలుంటే తెలపాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు రమావత్‌ శ్రీను మాట్లాడుతూ, నూతన గ్రామపంచాయతీగా పుల్యాతండాను ఏర్పాటు చేయడంతో గ్రామస్థులు సంతోషంగా ఉన్నారని అన్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే నోముల భగత్‌ పుల్యాతండాను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుకు కృషి చేశారని, ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రమావత్‌ చంద్రశేఖర్‌, రమావత్‌ సకారం, రమావత్‌ సీతారాంనాయక్‌, రమావత్‌ మోతి, రమావత్‌ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-07T00:57:32+05:30 IST