ఎస్పీ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రభుత్వాలు సహకరించాలి
ABN , First Publish Date - 2023-03-02T01:28:56+05:30 IST
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సహకరించాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్యమాదిగ అన్నారు.
సూర్యాపేట టౌన్, ఆత్మకూర్(ఎస్), కోదాడ టౌన్, తిరుమ లగిరి, మార్చి 1: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సహకరించాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్యమాదిగ అన్నారు. మాదిగ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌స్టేషన్ వద్ద మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించి మాట్లాడారు ఎస్సీల్లోని 59 కులాల ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీ గ్రూపులుగా విభజించాలని గత 27 సంవత్సరా లుగా పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసిన మాదిగ అమరవీరుల ఆశయాలు సాధించాలన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లకు వర్గీకరిస్తామని బీజేపీ నాయకులు హామీ ఇచ్చి అమలు చేయలేద న్నారు. కార్యక్రమంలో నాయకులు చింతలపాటి చినశ్రీరాములుమాదిగ, పిడమర్తి నాగేశ్వరిమాదిగ, ఎర్ర వీరస్వామిమాదిగ, పుట్టలమల్లేష్‌మాదిగ, కనకయ్యమాదిగ, చంద్రశేఖర్, దైద వెంకన్న, చింత సైదులు, గంట లింగయ్య, కృష్ణ, రవి, పాల్గొన్నారు.
- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించకుండా కాలయాపన చేస్తూన్నారని ఎమ్మార్పీఎస్ నాయకుడు ములకలపల్లి రవి మాదిగ అన్నారు. ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ మేడి కృష్ణ మాదిగ, బత్తుల వెంకట్, రాములు, కిరణ్, చిన్ని, వెంకటేష్, మధు, కళింగరెడ్డి, గంగరాజు పాల్గొన్నారు.