ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
ABN , First Publish Date - 2023-06-07T01:02:18+05:30 IST
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
శాలిగౌరారం, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ‘ప్రభుత్వ బడులను ఎవరు కాపాడాలి? ప్రభుత్వ బడికి పిల్లలు ఎందుకు రావడం లేదు?’ అనే అంశాలపై తెలంగాణ పౌరస్పందన వేదిక నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని చిత్తలూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రాశ్చాత్య దేశంలో పాఠశాల విద్యారంగం 90శాతం పైగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రభుత్వం పాఠశాలపై శ్రద్ధచూపడం లేదని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో పంపించాలని కోరారు. ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని, నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలల పటిష్ఠత కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ పౌరస్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, జడ్పీటీసీ ఎర్ర రణీల, సర్పంచు మామిడికాయల జయమ్మ, ఎంపీటీసీ దాసరి ప్రమీల, పాదూరి శంకర్‌రెడ్డి, మాజీ సర్పంచులు తీర్నాయకం సోమయ్య, గుడిపల్లి రాంరెడ్డి, బొమ్మగాని రవి, దాసరి దేవచిత్తం, టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్‌కమిటీ సభ్యులు జె. యాకయ్య, జిల్లా కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి ఉన్నారు.